22-12-2025 NORMAL NEWS 05:15 PM
swarnodayam.com
Telugu Daily News
22-12-2025 05:15 PM By Mandala Yadagiri

నాడు ఉద్యోగి.. నేడు సర్పంచ్ గా…నాడు తెర వెనుక వ్యూహాలు..నేడు నేరుగా రంగంలోకి… వార్త మల్లారెడ్డి ప్రస్థానం.. – ప్రమాణ స్వీకారం.. వెలువెత్తిన హర్షము

నాడు ఉద్యోగి.. నేడు సర్పంచ్ గా…నాడు తెర వెనుక వ్యూహాలు..నేడు నేరుగా రంగంలోకి… వార్త మల్లారెడ్డి ప్రస్థానం.. – ప్రమాణ స్వీకారం.. వెలువెత్తిన హర్షము
IMG_20251222_171038

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: 1989లో ఇప్పటి హుజురాబాద్ స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డికి నమ్మిన శిష్యునిగా, TRS ఆవిర్భావం నుంచి ఈటల రాజేందర్ కు అనుచరుడిగా కొనసాగి..గత జూన్ 30న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పదవి విరమణ చేసిన అనంతరం BRS లో కట్కూరి మల్లారెడ్డి చేరారు. ముందు నుండి జర్నలిజంపై ఆసక్తితో కొంత కాలం పాటు జర్నలిస్టుగా పనిచేసిన మల్లారెడ్డి వార్త మల్లన్నగా హుజురాబాద్ ప్రాంతంలో ప్రసిద్ధి. ఆయన మొదటి నుండి గ్రామ సమస్యలపై దృష్టి పెట్టి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేశారు. ప్రధానంగా పోలీస్ స్టేషన్, రెవెన్యూ, విద్యుత్ శాఖ, ఆర్టీఓ తదితర ప్రధాన ప్రభుత్వ శాఖల అధికారులతో ఉన్న సమన్వయంతో చేసిన సహాయ సహకారాలు ఈ నెల 17న జరిగిన ఎన్నికల్లో విజయం సాధించడానికి కారణం అయ్యాయి.
ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థికి 265 ఓట్లు రాగా మల్లారెడ్డికి 566 ఓట్లు సాధించి 301 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అలాగే 8 వార్డులను కైవసం చేసుకుని వార్ వన్ సైడ్ గా చేయడంలో మల్లారెడ్డి సఫలం అయ్యారు. ఇప్పటివరకు ఆయన నడుచుకున్న తీరువేరు, ఇప్పటినుండి నేర్చుకోవాల్సిన తీరువేరుగా మారింది. మండలంలోనే రాజపల్లి గ్రామపంచాయతీగా ఏర్పడి ఐదేళ్లు కాగా ఇప్పుడు మల్లారెడ్డితో రెండవ పాలకవర్గం కొలువు తీరనున్నది. సోమవారం రాజ పల్లి సర్పంచ్ గా మల్లారెడ్డి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయనకు అభినందనల వెల్లువ హోరెత్తింది. ఎన్నికల సమయంలో తను ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి విడుదలవారీగా నెరవేర్చి ఎందుకు సిద్ధంగా ఉన్నారని అందుకు అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు ప్రతి ఒక్కరిని కలుసుకొని నిధులు రాబట్టేలకు కృషి చేస్తారని మల్లారెడ్డి స్పష్టం చేశారు. తనపై ఎంతో నమ్మకంతో భారీ మెజార్టీతో గెలిపించిన రాజపల్లి గ్రామ ప్రజల రుణం ఐదేళ్లలో తప్పక తీర్చుకుంటానని ఆయన తెలిపారు.

సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న కటుకూరు మల్లారెడ్డి..

ప్రమాణస్వీకారం చేపించిన అధికారిని సత్కరిస్తున్న సర్పంచ్ మల్లారెడ్డి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు

Oplus_16908288

మల్లారెడ్డి దంపతులను సత్కరిస్తున్న తాజా మాజీ సింగిల్ విండో చైర్మన్ అలమల్ల శ్యాంసుందర్ రెడ్డి దంపతులు…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!