Social 1080×1350 • Multi-page
22-12-2025 BREAKING NEWS 07:03 PM
swarnodayam.com
Telugu Daily News

అట్టహాసంగా వన్నారం గ్రామపంచాయతి పాలకవర్గ ప్రమాణ స్వీకారం.. – ముఖ్య అతిథిగా పాల్గొన్న పోలాడి రామారావు

అట్టహాసంగా వన్నారం గ్రామపంచాయతి పాలకవర్గ ప్రమాణ స్వీకారం.. – ముఖ్య అతిథిగా పాల్గొన్న పోలాడి రామారావు
IMG-20251222-WA0033

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
ఇటీవలే గెలుపొందిన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల పరిధిలోని వన్నారం, షెంశాబాద్ గ్రామ పంచాయతి పాలకవర్గాల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా ఆయా గ్రామాల ప్రజలమధ్య అధికారులు నిర్వహించగా సీనియర్ సిటిజన్ ప్రజాసంఘాల నాయకుడు పోలాడి రామారావు హాజరై నూతనంగా ఎన్నికైన పాలకవర్గాలకు శుభాకాంక్షలు తెలిపారు. వన్నారం, శెంశాబాద్ గ్రామాలలో నిర్వహించిన కార్యక్రమాల్లో పోలాడి రామారావు పాల్గొని మాట్లాడుతూ ఎన్నికైన గ్రామాల సర్పంచ్ లు పార్టీల కతీతంగా, వర్గాల కతీతంగా అందరినీ సమన్వయం చేసుకొని గ్రామాల అభివృద్ధికి పాటుపడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసి మన్ననలు పొందాలని సూచించారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారం తో పనిచేస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల్లో గొడవలకు తావు లేకుండా గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలని కోరారు.
గ్రామ పంచాయతి సర్పంచ్ పదవి ప్రోటోకాల్ ప్రకారం అత్యున్నత పదవి అని రామారావు అన్నారు. ఇదే ప్రాంతానికి చెందిన నేను ఈ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని, తన సంపూర్ణ సహకారం అందిస్తానని ఆయా గ్రామస్థుల హర్షధ్వానాల మధ్య పోలాడి రామారావు తెలిపారు. నూతనంగా ఎన్నికైన వన్నారం గ్రామ పంచాయతి సర్పంచ్ తాళ్ళపల్లి సంపత్, ఉప సర్పంచ్ భాకారపు రాములు, శెంశాబాద్ సర్పంచ్ మేరుగు కళావతి సంపత్, ఉప సర్పంచ్ డొల్ల సతీశ్ లను శాలువాలు కప్పి రామారావు సన్మానించి శుభాకాంక్షలు తెలుపగా తిరిగి వాళ్ళు సైతం పోలాడి రామారావును శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ముందుగా ఈ రెండు గ్రామాల స్పెషల్ ఆఫీసర్, మండల పరిషత్ ఏఈ వెంకన్న నూతనంగా ఎన్నికైన పాలక మండళ్ల సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డుసభ్యులను ప్రమాణ పత్రం తో ప్రతిజ్ఞ చేయించి ప్రమాణ స్వీకారం చేయించారు. వన్నారం, శెంశాబాద్ గ్రామాల పంచాయతి సెక్రటరీలు ప్రసూన, కవిత ఆయా గ్రామాల ప్రజలు పంచాయతి ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ప్రమాణ స్వీకారం అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతున్న వన్నారం సర్పంచ్..

Oplus_16908288

గ్రామస్తుల ఉద్దేశించి మాట్లాడుతున్న సినియర్ సిటిజన్ ప్రజాసంఘాల నాయకుడు పోలాడి రామారావు

సీనియర్ సిటిజన్ ప్రజాసంఘాల నాయకుడు పోలాడి రామారావును సత్కరిస్తున్న సర్పంచ్, పాలకవర్గ సభ్యులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!