Social 1080×1350 • Multi-page
25-12-2025 BREAKING NEWS 06:47 PM
swarnodayam.com
Telugu Daily News

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలి.. – ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు…

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలి.. – ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు…
IMG-20251225-WA0054

జనవరి 11న లక్ష మంది తో హనుమకొండలో రాష్ట్ర స్థాయి ఓసి ల సింహగర్జన సమరభేరి….

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (సిరిసిల్ల): ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలోప్రత్యేక ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. గురువారం సిరిసిల్లలోని పద్మనాయక వేడుకల మందిరంలో జనవరి 11న వరంగల్ లో నిర్వహించ తలపెట్టిన ఓసిల సింహగర్జన సమరభేరికి సంబంధించి రాష్ట్ర జిల్లా నాయకుల తో కలిసి సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ 10 శాతం ఈడబ్లూఎస్ రిజర్వేషన్ల పై స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని దుష్ట శక్తులు ఆయా కులాల్లోని ప్రజలను మభ్య పెడుతూ చేస్తున్న అసత్య ప్రచారాలను, కుట్రలను సాగమివ్వబోమని దీనిపై ప్రజలను అప్రమత్తం చెయ్యాలని ఓసి ఐకాస నాయకులకు రామారావు పిలుపునిచ్చారు.

ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి షరతులు లేని 5 ఏండ్ల కాలపరిమితిని కలిగి ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఓసి ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు విద్యా ఉద్యోగ పోటీ పరీక్షలలో వయోపరిమితిని పెంచాలని, ఈడబ్ల్యూఎస్ వారికి కేటాయించిన మిగిలిపోయిన బ్యాక్ లాగ్ పోస్టులను ఆ వర్గాల వారితోనే వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి 10లక్షల ఆదాయ పరిమితి పెంచాలని డిమాండ్ చేశారు.
టెట్ అర్హత పరీక్ష మార్కులను ఈడబ్ల్యూస్ వర్గాలకు 90 నుంచి 70 మార్కులకు తగ్గించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను వర్తింప చేయాలని, ఓసి వర్గాలవారికి జనాభా ప్రాతిపదికన రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. తమ డిమాండ్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లేందు కోసం జనవరి నెల 11న సాయంత్రం 3 గంటలకు హన్మకొండ లోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో రాష్ట్ర ఓసి జేఏసీ ఆధ్వర్యంలో లక్ష మందితో నిర్వహించతలపెట్టిన ఓసి ల సింహగర్జన భారీ బహిరంగ సభకు ఓసి వర్గీయులందరూ రాజకీయాల కతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్, కరపత్రాలను సమావేశంలో ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, ఓసి ఐకాస రాష్ట్ర నాయకులు చెన్నమనేని పురుషోత్తంరావు, వనమాల ప్రభాకర్ రెడ్డి, చెపూరి అశోక్, ఆల్ ఇండియా వెలమ సంఘం ఉపాధ్యక్షులు తాండ్ర శ్రీనివాస రావు, సిరిసిల్ల జిల్లా వెలమ సంఘం అధ్యక్షుడు చెన్నమనేని కమలాకర్ రావు, జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు బుస్సా దశరథం, కామారెడ్డి జిల్లా వెలమ సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రావు, నాయకులు సురభి నరేన్ గాంధీ, నాయిని మంగ, బొంత రజిత, బొంపెల్లి రవీందర్ రావు, సురభి సత్య నారాయణరావు, వెన్నమనేని రామచందర్ రావు సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల ఐకాస నాయకులు తదితరలు పాల్గొన్నారు.

Oplus_16908288
Oplus_16908288
Oplus_16908288

సమావేశంలో మాట్లాడుతున్న ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు…

Oplus_16908288

బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్, కరపత్రాలను సమావేశంలో ఆవిష్కరిస్తున్న ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు…

Oplus_16908288

సమావేశం హాజరైన ఓసి కుల సంఘాల నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!