Social 1080×1350 • Multi-page
25-12-2025 BREAKING NEWS 09:24 PM
swarnodayam.com
Telugu Daily News

కల్వర్ టెంపుల్ రంగాపూర్ చర్చిలో రెవరెండ్ డాక్టర్ పి.ఆర్. నెల్సన్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు..

కల్వర్ టెంపుల్ రంగాపూర్ చర్చిలో రెవరెండ్ డాక్టర్ పి.ఆర్. నెల్సన్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు..
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: క్రీస్తు జన్మదినం పురస్కరించుకొని ఉదయం నుంచే క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో నూతన వస్త్రాలతో చర్చిలో ప్రవేశించారు. పిల్లల నాట్యాలతో యూత్ స్కిట్స్ తో క్రీస్తు పుట్టిన నాటికలతో క్రైస్తవులను ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా రాంపూర్ సర్పంచ్ ముశం సంగీత గణేష్, రంగాపూర్ సర్పంచ్ కుంట అరుణ తిరుపతిరెడ్డిలు హాజరయ్యారు. ఇరు గ్రామాల సర్పంచ్ లు మాట్లాడుతూ క్రిస్మస్ రోజు మేము చర్చ్ లో గడపడం గొప్ప ఆనందంగా ఉందని, క్రీస్తుపుట్టుక ప్రజలకు చాలా మేలు చేసిందని బైబిల్ ప్రవచనాలు సత్ప్రవర్తనకు ఎంతో దోహదపడతాయని తెలిపారు. చర్చ్ ఫాదర్ నెల్సన్ మాట్లాడుతూ ఈ డిసెంబర్ 25 క్రీస్తు పుట్టిన రోజు ఒక భారత దేశం లోనే కాకుండా ప్రపంచమంతా ఒకే రోజున జరుపుకుంటారని, క్రైస్తవ్యం ఒక మతం కాదని ఒక చక్కని మార్గమని, బైబిల్ ఒక మత గ్రంథం కాదని ఒక మహా ఙ్ఞాన గ్రంథమని తెలిపారు. హాజరైన పేద విధవ రాండ్లకు బొడ్డు రాజరత్నం కమల కుటుంబం 15 మందికి సర్పంచుల చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. సర్పంచ్ లను మరియు చర్చ్ సభ్యులు బండ మాధవి రమేష్ వార్డ్ మెంబర్ గా గెలిచినందుకు సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. చర్చ్ ఫాదర్ నెల్సన్ చేస్తున్న మంచి కార్యక్రమాలను బట్టి సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు ఫాదర్ నెల్సన్ సుదిన దంపతులను సన్మానించారు. అనంతరం చర్చ్ ఫాదర్ తో సహా అతిధులందరూ కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం క్రైస్తవులతో పాటు హాజరైన ప్రతి ఒక్కరికి క్రిస్మస్ విందును ఏర్పాటు చేశారు.

భారీ కేక్ కట్ చేస్తున్న ముఖ్య అతిథులు..

రెవరెండ్ పాస్టర్ నెల్ సన్ కు కేక్ తినిపిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న సర్పంచులు…

వితంతు వృద్ధురాలకి బట్టలు పంపిణీ చేస్తున్న అతిథులు..

సాంస్కృతిక కార్యక్రమాలు నత్యాలు చేస్తున్న మహిళలు..

నృత్యాలు చేస్తున్న యువకులు…

కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న రంగాపూర్ సర్పంచ్ ..

కార్యక్రమాలను ఉద్దేశించి మాట్లాడుతున్న రాంపూర్

మాట్లాడుతున్న చర్చ్ ఫాదర్ నెల్సన్..

ప్రత్యేక గీతాలు ఆలపిస్తున్న సంఘ సభ్యులు..

ఆకట్టుకున్న యువకుడి నృత్యం…

పాస్టర్ నెల్సన్ దంపతులను సన్మానిస్తున్న అతిథులు, దాతలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!