Social 1080×1350 • Multi-page
26-12-2025 BREAKING NEWS 08:06 AM
swarnodayam.com
Telugu Daily News

భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ పండుగ వేడుకలు

భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ పండుగ వేడుకలు
IMG-20251226-WA0019

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం క్రైస్తవులు క్రిస్మస్ పండుగ వేడుకలను సాంప్రదాయబద్ధంగా భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పండుగను పురస్కరించుకొని పాస్టర్లు ఏసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని వివరించి , పాపాలను పోగొట్టడానికి ఏసుక్రీస్తు చేసిన త్యాగాలను శాంతి కరుణ దయ రూపుడైనా యేసు గురించి వివరించారు. ఈ సందర్భంగా పలువురు గీతాలను ఆలపించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా హుజురాబాద్ మునిసిపల్ కమిషనర్ కే సమ్మయ్య, నాయకులు, కొలిపాక శ్రీనివాస్, వెంకటరెడ్డి, నల్ల సుమన్ తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. పట్టణంలోని సిఎస్ఐ, అగపే , ఇండియా మిషన్ ,బిలీవర్స్ , కల్వరి తదితర చర్చిలలో పాస్టర్లు జాన్ బాబు, డేనియల్, నవీన్, డేవిడ్ రాజు, నెల్సన్, జకారియా పాల్గొని ఏసుక్రీస్తు వాక్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో విజయ, సొల్లు బాబు, చరణ్ కుమార్ ,జి రవీందర్ ఎస్ మహేందర్, యేముల పుష్పలత, సునీత, జి హిమవంత్, ఈసంపల్లి బంగారి, ఎన్ పద్మ, బి భావన, సవిత, అల్లెపు ఏలియా, ఏ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.

Oplus_16908288
Oplus_16908288

సిఎస్ఐ చర్చిలో…

అగాపే చర్చలో…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!