Social 1080×1350 • Multi-page
27-12-2025 BREAKING NEWS 03:27 AM
swarnodayam.com
Telugu Daily News

ఫలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కృషి…- బీజేపీ సీనియర్ నాయకులు మట్ట పవన్ రెడ్డి

ఫలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కృషి…- బీజేపీ సీనియర్ నాయకులు మట్ట పవన్ రెడ్డి
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘ఖేలో ఇండియా’ ద్వారా క్రీడలు గ్రామ స్థాయికి చేర్చాలనే మాటలకు, జమ్మికుంటే ప్రత్యక్ష ఉదాహరణ అని బీజేపీ సీనియర్ నాయకులు మట్ట పవన్ రెడ్డి అన్నారు. మట్ట పవన్ రెడ్డి ఇల్లందకుంట మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 4 లైన్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణం కోసం రూ. 6.50 కోట్ల నిధులను జమ్మికుంట పట్టణానికి ఖేలో ఇండియా పథకం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ద్వారా విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, క్రీడలను ప్రోత్సహిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో కూడా అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందించాలన్న కేంద్ర ప్రభుత్వ దూరదృష్టి వల్ల ఈ ప్రాజెక్టు సాకారం అవుతోందనీ అన్నారు. ఈ నిధుల మంజూరు ద్వారా జమ్మికుంట, పరిసర ప్రాంతాల యువతకు ఉత్తమమైన శిక్షణా అవకాశాలు, అథ్లెటిక్ రంగంలో మెరుగైన భవిష్యత్తు కోసం గ్రామీణ ప్రతిభను గుర్తించి, ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలన్న క్రీడా విజన్‌కి ఇది మరో ఉదాహరణ అని తెలిపారు. మోడీ ప్రభుత్వ అభివృద్ధి లక్ష్యాల్లో క్రీడలు కూడా ముఖ్యమైన భాగమని ఈ నిర్ణయం మరోసారి రుజువు చేసిందన్నారు. జమ్మికుంట పరిసర ప్రాంత యువ క్రీడాకారులు రాబోయే రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పతాకాలు ఎగరేవారనే సంపూర్ణ నమ్మకం మాకు ఉందనీ మట్ట పవన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ట్రాక్ నిర్మాణం పూర్తయిన వెంటనే జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, కమలాపూర్ సహా పరిసర మండలాల యువ అథ్లెట్స్‌కు అంతర్జాతీయ స్థాయి శిక్షణా అవకాశాలు లభించనున్నాయనీ తెలిపారు. స్థానిక ప్రతిభను వెలికితీసి, జాతీయ – అంతర్జాతీయ వేదికలపై పోటీ చేయగల సామర్థ్యాన్ని పెంపొందించే బలమైన వేదికగా ఈ ప్రాజెక్టు నిలవనుందనీ తెలిపారు. దీనికి కృషి చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మరియు కేంద్ర మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ కి, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మంత్రి మన్సుక్ మాండవియకి పవన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Oplus_16908288

బీజేపీ సీనియర్ నాయకులు మట్ట పవన్ రెడ్డి

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!