Social 1080×1350 • Multi-page
27-12-2025 BREAKING NEWS 04:18 PM
swarnodayam.com
Telugu Daily News

జీవో నం. 252 సవరణ/ రద్దు కోరుతూ కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు TUWJ (H143) యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల భారీ నిరసన, వినతి.

జీవో నం. 252 సవరణ/ రద్దు కోరుతూ కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు TUWJ (H143) యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల భారీ నిరసన, వినతి.
IMG-20251227-WA0058

జిల్లా నలుమూలల నుండి భారీగా తరలివచ్చిన జర్నలిస్టులు.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్, 27 డిసెంబర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో Ms.No.252 (తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్-2025)ను వెంటనే సవరించాలని లేదా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ H-143) ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు జర్నలిస్టులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆందోళనలో ఫీల్డ్ రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించిన జర్నలిస్టులు, కొత్త జీవోలోని నిబంధనలు అస్పష్టంగా ఉండటం, డెస్క్ జర్నలిస్టులకు కేవలం ‘మీడియా కార్డు’ మాత్రమే ఇవ్వడం, చిన్న పత్రికలు (15,000 కంటే తక్కువ సర్క్యులేషన్ ఉన్నవి), కేబుల్ ఛానళ్లు, ఫ్రీలాన్స్ జర్నలిస్టులపై కఠిన నియమాలు విధించడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డులు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

TUWJ H-143 కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చెరుకు గోపాలకృష్ణ మాట్లాడుతూ, “ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన అక్రిడిటేషన్లు జారీ చేయడం అభినందనీయమే అయినప్పటికీ, ఈ జీవోలోని నిబంధనలు జర్నలిస్టుల మధ్య విభజన సృష్టిస్తున్నాయి. డెస్క్ జర్నలిస్టులకు పూర్తి అక్రిడిటేషన్ కార్డు ఇవ్వకుండా ‘మీడియా కార్డు’ పేరిట వేరుచేయడం అసంతృప్తికి కారణమవుతోంది. అలాగే, చిన్న పత్రికలకు అన్యాయం జరుగుతోంది. ఫీల్డ్, డెస్క్ జర్నలిస్టుల మధ్య తేడా లేకుండా అందరిని ఒకే విధంగా అక్రిడిటెడ్ జర్నలిస్టులుగా గుర్తించేలా జీవోను సవరించాలన్నారు.

ముఖ్య డిమాండ్లు ఈ విధంగా ఉన్నాయి.

  • డెస్క్ జర్నలిస్టులకు జిల్లా అక్రిడిటేషన్ కమిటీలో చోటు కల్పించాలి.
  • రెండు రకాల కార్డుల విధానాన్ని రద్దు చేయాలి.
  • చిన్న మీడియా సంస్థలు, ఫ్రీలాన్స్ జర్నలిస్టులకు సడలింపులు ఇవ్వాలి.

ఈ కార్యక్రమంలో TUWJ రాష్ట్ర నాయకులు ప్రకాష్ రావు, వేణుగోపాలరావు, జిల్లా నాయకులు జెర్రిపోతుల సంపత్, రామకృష్ణ, హృషికేష్, గూడూరు కొండల్ రెడ్డి, మండల యాదగిరి, డెస్క్ జర్నలిస్ట్ నాయకులు సుభాష్, సంపత్, శ్రీనివాస్ తో పాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన స్టాఫ్ రిపోర్టర్లు, టౌన్ రిపోర్టర్లు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లు, టౌన్ రిపోర్టర్లు, సీనియర్ జర్నలిస్టులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!