28-12-2025 NORMAL NEWS 05:21 AM
swarnodayam.com
Telugu Daily News
28-12-2025 05:21 AM By Mandala Yadagiri

వృద్ధురాలి పుస్తెలతాడు చోరీకి యత్నం..- మెడలో తాడు లాగడంతో స్వల్ప గాయాలు

వృద్ధురాలి పుస్తెలతాడు చోరీకి యత్నం..- మెడలో తాడు లాగడంతో స్వల్ప గాయాలు
IMG_20251228_051441

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని డీసీఎంఎస్ కాంప్లెక్స్ వద్ద జిలుగుల గ్రామానికి చెందిన ఒక వృద్ధురాలి మెడ నుండి గుర్తు తెలియని వ్యక్తి పుస్తెలతాడు చోరీకి యత్నించాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం…. మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో ఒక వృద్ధురాలు డిసిఎంఎస్ కాంప్లెక్స్ షాపుల ముందు నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తి ఆమె వద్దకు వచ్చి ఆమె మెడలో నుండి పుస్తెలతాడు చోరీకి యత్నించాడనీ తెలిపారు. ఈ సంఘటనలో ఆమె కింద పడగా స్వల్ప గాయాలయ్యాయని ఆమె గట్టిగా అరవడంతో గుర్తు తెలియని వ్యక్తి పారిపోయాడని తెలిపారు. సమీపంలోనే పోలీసులు ఉన్న అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించక పోగ కేసు పెట్టమని ఉత్త ఉత్త సలహా ఇచ్చారు అని స్థానికులు ఆరోపించారు. సమీప సిసి కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టి దొంగను గుర్తించాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.

మెడలో తాడు లాగడంతో కింద పడి స్వల్ప గాయాలకు గురైన వృద్ధురాలు..

దొంగ మెడలో తాడు లాగడంతో పుస్తెలు కింద పడడంతో చూపుతున్న వృద్ధురాలు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!