28-12-2025 NORMAL NEWS 06:47 PM
swarnodayam.com
Telugu Daily News
28-12-2025 06:47 PM By Mandala Yadagiri

ఓసి ల సింహగర్జన సమరభేరిని విజయవంతం చేయాలి. – ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర ఐకాస నాయకులు

ఓసి ల సింహగర్జన సమరభేరిని విజయవంతం చేయాలి. – ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర ఐకాస నాయకులు
IMG-20251228-WA0013

ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర ఐకాస నాయకులు చందుపట్ల నర్సింహారెడ్డి గూడూరి స్వామి రెడ్డి, పోరెడ్డి శంతన్ రెడ్డి, తాటిపల్లి రాజన్న. కంకనాల సరోజన….

జనవరి 11న హన్మకొండలో లక్ష మందితో ఓసిల సింహ గర్జన

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో జనవరి 11న లక్ష మందితో, రెడ్డి, వైశ్య, వెలమ బ్రాహ్మణ, కమ్మ, మార్వాడిల సంఘాలతో ఏర్పడిన రాష్ట్ర ఓసి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర స్థాయి ఓసిల సింహగర్జన సమరభేరి సభను జయప్రదం చేయాలని ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావుతో పాటు పలువురు ఓసి ఐకాస రాష్ట్ర నాయకులు పిలుపు నిచ్చారు.
ఆదివారం హుజురాబాద్ లోనీ సిటి సెంట్రల్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో రెడ్డి, వెలమ, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడి సంఘాల నాయకులు హాజరైనారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన పోలాడి రామారావుతో పాటు ఐకాస నాయకులు గూడూరి స్వామిరెడ్డి, చందుపట్ల నర్సింహారెడ్డి, పోరెడ్డి శంతన్ రెడ్డి, తాటిపల్లి రాజన్న, కంకణాల సరోజన, ఎడవెల్లి కొండాల్ రెడ్డి, గందే శ్రీనివాస్, పోల్సాని రామారావు, ముచ్చ సమ్మిరెడ్డి, రాం స్వరన్ రెడ్డిలు మాట్లాడుతూ ఓసిలందరూ ఐకమత్యంతో ఉంటేనే తమ హక్కులు కాపాడుకోగలమని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై రాజకీయ పబ్బo కోసం కొన్ని దుష్ట శక్తులు చేస్తున్న అసత్య ప్రచారాలు, పన్నుతున్న కుట్రలను సాగనువ్వబోమని హెచ్చరించారు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు ఈ క్రింది డిమండ్లను ముందుంచాం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు జాతీయ రాష్ట్ర స్థాయిలో చట్ట బద్దత గల ప్రత్యేక ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలి. ఓసి విద్యార్థులకు టెట్ రాత పరీక్ష అర్హత మార్కులను 90 నుంచి 70 కి తగ్గించాలి. ఈడబ్లూఎస్ అభ్యర్థులకు విద్యా ఉద్యోగ పోటీ పరీక్షలలో వయో పరిమితిని పెంచాలని, ఈడబ్లూఎస్ సర్టిఫికెట్ జారీకి ఎలాంటి షరతులు లేకుండా 5 ఏండ్ల కాలపరిమితి కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఈడబ్ల్యూఎస్ వారికి కేటాయించిన మిగిలిపోయిన బ్యాక్ లాగ్ పోస్టులను ఈడబ్ల్యూఎస్ వారితోనే వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈడబ్లూఎస్ సర్టిఫికెట్ జారీకి వార్షిక ఆదాయ పరిమితిని 10 లక్షలకు పెంచాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు నిరుపేద ఓసి విద్యార్థులకు వర్తింప చేయాలని, జనాభా దామాషా ప్రకారం ఓసిలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలనే డిమండ్లతో జనవరి నెల 11న లక్ష మంది ఓసి సామాజిక వర్గీయులతో రాష్ట్ర స్థాయి ఓసిల సింహగర్జన సభను హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. పార్టీలకతతంగా రెడ్డి, వైశ్య, వెలమ బ్రాహ్మణ కమ్మ, మార్వాడి లందరూ పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని పోలాడి రామారావు, ఐకాస నాయకులు కోరారు. ఈసందర్భంగా ఓసిల సింహగర్జన సమరభేరి సభకు సంబంధించిన గోడ ప్రతులను, కరపత్రాలను సమావేశంలో ఐకాస నాయకులు ఆవిష్కరించారు.
సమావేశంలో మూగల రాజిరెడ్డి, క్యాస ఉపేందర్, పోరెడ్డి కిషన్ రెడ్డి, గోలి సరోజన, గూడూరి స్వామిరెడ్డి, ఏనుగు మహిపాల్ రెడ్డి, కొన్నే సమ్మిరెడ్డి, ఉమ్మెంతల శ్యాం సుందర్ రెడ్డి, సారబుడ్ల రాజిరెడ్డి, ఈదులకంటి దేవేందర్ రెడ్డి, దోమకుంట్ల దేవేందర్ రెడ్డి, గూడూరి చైతన్యరెడ్డి, గూడూరి మల్లారెడ్డి, బోయినపల్లి దేవేందర్ రావులతో పాటు హుజురాబాద్, హుస్నాబాద్ డివిజన్ల ఓసి సామాజిక వర్గీయులు హాజరైనారు.

Oplus_16908288

సమావేశంలో మాట్లాడుతున్న ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు

Oplus_16908288

ఓసిల సింహగర్జన సమరభేరి సభకు సంబంధించిన గోడ ప్రతులను, కరపత్రాలను సమావేశంలో ఆవిష్కరిస్తున్న ఐకాస నాయకులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!