Social 1080×1350 • Multi-page
28-12-2025 BREAKING NEWS 07:10 PM
swarnodayam.com
Telugu Daily News

నేడు(సోమవారం) నూతన ప్రజా ప్రతినిధులకు సన్మానం

నేడు(సోమవారం) నూతన ప్రజా ప్రతినిధులకు సన్మానం
IMG-20251228-WA0015

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో హుజురాబాద్ మండలంలో విజయం సాధించిన బీసీ, ఎస్సీ ఎస్టీ ప్రజా ప్రతినిధులకు సన్మానం చేస్తున్నట్లు ప్రజాస్వామ్య బిసి ఉద్యమ వేదిక హుజురాబాద్ కన్వీనర్ సాదుల రవీందర్ బాబు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ… హుజురాబాద్ మండలంలోని 20 గ్రామపంచాయతీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బహుజనులు 15 మంది విజయం సాధించారని, వారిలో సర్పంచులు, ఉపసర్పంచులకు ఈనెల 29వ తేదీ సోమవారం రోజున హుజురాబాద్ క్లబ్ లో సన్మానం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సన్మాన సభకు బహుజనులంతా హాజరుకావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో బీసీ ఉద్యమ నాయకులు భీమోజు సదానందం, పులి జగన్నాథం, ప్రజా సంఘాల నాయకులు వేల్పుల రత్నం, మాజీ ఎంపీపీ అనగొని వెంకటరాజము, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న సాధుల రవీందర్ బాబు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!