30-12-2025 NORMAL NEWS 07:12 PM
swarnodayam.com
Telugu Daily News
30-12-2025 07:12 PM By Mandala Yadagiri

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలి.. – ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు,రాష్ట్ర అర్చక సంఘం అధ్యక్షుడు నిట్టూరి సతీశ్ శర్మ.

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలి.. – ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు,రాష్ట్ర అర్చక సంఘం అధ్యక్షుడు నిట్టూరి సతీశ్ శర్మ.
IMG_20251230_190243

జనవరి 11న లక్ష మందితో హనుమకొండలో రాష్ట్ర స్థాయి ఓసి ల సింహగర్జన సమరభేరి.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (పెద్దపల్లి): ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలోప్రత్యేక ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర అర్చక సంఘం అధ్యక్షుడు నిట్టూరి సతీశ్ శర్మ, ఓసి ఐకాస రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వంగల తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. జనవరి 11న వరంగల్ లో నిర్వహించ తలపెట్టిన ఓసిల సింహగర్జన సమరభేరికి సంబంధించి ఏర్పాట్లపై మంగళవారం కాల్వశ్రీరాంపూర్ లో నిర్వహించిన పెద్దపల్లి జిల్లా స్థాయి ఓసి ఐకాస నాయకుల సన్నాహక సమావేశంలో రెడ్డి, వెలమ, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ సంఘాల నాయకులు హాజరయ్యారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు,
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన పోలాడి రామారావుతో పాటు రాష్ట్ర అర్చక సంఘం అధ్యక్షుడు నిట్టూరి సతీశ్ శర్మ, ఓసి ఐకాస రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వంగల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ 10 శాతం ఈడబ్లూఎస్ రిజర్వేషన్లపై స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని దుష్ట శక్తులు ఆయా కులాల్లోని ప్రజలను మభ్య పెడుతూ చేస్తున్న అసత్య ప్రచారాలను, కుట్రలను సాగమివ్వబోమని దీనిపై ప్రజలను అప్రమత్తం చెయ్యాలని ఓసి ఐకాస నాయకులకు రామారావు, ఐకాస నాయకులు పిలుపునిచ్చారు.

ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి షరతులు లేని 5 ఏండ్ల కాలపరిమితిని కలిగి ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఓసి ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు విద్యా ఉద్యోగ పోటీ పరీక్షలలో వయోపరిమితిని పెంచాలని , ఈడబ్ల్యూఎస్ వారికి కేటాయించిన మిగిలిపోయిన బ్యాక్ లాగ్ పోస్టులను ఆ వర్గాల వారితోనే వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి 10లక్షల ఆదాయ పరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. టెట్ అర్హత పరీక్ష మార్కులను ఈడబ్ల్యూస్ వర్గాలకు 90 నుంచి 70 మార్కులకు తగ్గించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను వర్తింప చేయాలని కోరారు. తమ డిమాండ్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లేందు కోసం జనవరి నెల 11న సాయంత్రం 3 గంటలకు హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో రాష్ట్ర ఓసి జేఏసీ ఆధ్వర్యంలో లక్ష మందితో నిర్వహించ తలపెట్టిన ఓసిల సింహగర్జన భారీ బహిరంగ సభకు ఓసి వర్గీయులందరూ రాజకీయాల కతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్, కరపత్రాలను సమావేశంలో ఆవిష్కరించారు. ముందుగా రాష్ట్ర అర్చక సంఘం అధ్యక్షుడు నిట్టూరి సతీశ్ శర్మను పెద్దపల్లి జిల్లా ఓసి ఐకాస నాయకులతో కలిసి పోలాడి రామారావు శాలువా కప్పి వరంగల్ ఓసి జేఏసీ సింహగర్జనకు ఆహ్వన పత్రిక అందజేసి ఆశీస్సులు తీసుకున్నారు.
కార్యక్రమంలో ఐకాస నాయకులు వంగల తిరుపతిరెడ్డి, యాంసాని రాఘవులు, సుదాటీ కరుణాకర్ రావు, వడ్లూరి రాజేశ్వర్ రావు, కోలేటీ అశోక్, పెద్దిరెడ్డి వీరారెడ్డి, కాల్వ రాధాకృష్ణారెడ్డి, వివిధ మండలాల ఐకాస నాయకులు పాల్గొన్నారు.

Oplus_16908288

ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు,

Oplus_16908288
Oplus_16908288

రాష్ట్ర అర్చక సంఘం అధ్యక్షుడు నిట్టూరి సతీశ్ శర్మను పెద్దపల్లి జిల్లా ఓసి ఐకాస నాయకులతో కలిసి పోలాడి రామారావు శాలువా కప్పి వరంగల్ ఓసి జేఏసీ సింహగర్జనకు ఆహ్వన పత్రిక అందజేసి ఆశీస్సులు తీసుకున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!