Social 1080×1350 • Multi-page
30-12-2025 BREAKING NEWS 11:54 PM
swarnodayam.com
Telugu Daily News

తిరుమలలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినీ మర్యాదపూర్వకంగా కలుసుకున్న దొంత రమేష్

తిరుమలలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినీ మర్యాదపూర్వకంగా కలుసుకున్న దొంత రమేష్
IMG_20251230_234850

– హుజురాబాద్ నియోజకవర్గములో
ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాల
వివరన

– అభివృద్ధి కొరకు నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రినీ కోరిన రమేష్

– వోడితల ప్రణవ్ నాయకత్వములో కాంగ్రెస్ పార్టీ బలోపేతము
– రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో జమ్మికుంట హుజురాబాద్ కైవసం చేసుకుంటాము..

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తిరుమలలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సందర్భంగా, తిరుమలలో ఆయనని మాజీ టీపీసీసీ ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్, హుజురాబాద్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దొంత రమేష్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా హుజురాబాద్
నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని మంగళకరమైన దీవెనలు ప్రజలందరికీ కలగాలని ఆ వైకుంఠ నాధుడిని కోరుకుంటూ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. అభివృద్ధి కొరకు నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రినీ రమేష్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ నాయకత్వములో కాంగ్రెస్ పార్టీనీ నియోజకవర్గంలో మరింత బలోపేతము చేస్తామన్నారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటాము అని ముఖ్యమంత్రికి వివరించినట్లు రమేష్ తెలిపారు.

Oplus_16908288
Oplus_16908288

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినీ కలసి హుజురాబాద్ ప్రగతిపై వివరిస్తున్న మాజీ టీపీసీసీ ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్, హుజురాబాద్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దొంత రమేష్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!