31-12-2025 NORMAL NEWS 08:44 PM
swarnodayam.com
Telugu Daily News
31-12-2025 08:44 PM By Mandala Yadagiri

వార్డు సభ్యులకు సగర సంఘం నాయకుల సన్మానం

వార్డు సభ్యులకు సగర సంఘం నాయకుల సన్మానం
IMG-20251231-WA0126

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (వీణవంక ): ఇటీవల జరిగిన గ్రామం పంచాయతీ ఎన్నికల్లో వీణవంక మండలంలోని పలు గ్రామాల్లో వార్డు సభ్యులుగా గెలిచిన పలువురిని కరీంనగర్‌ జిల్లా సగర సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా మండలంలోని శ్రీరాములపేట గ్రామంలో కుర్మిండ్ల మల్లయ్య సగర, కొత్తపల్లిలో గుంటి తిరుపతి, వల్బాపూర్‌ గ్రామంలో నలుబాల రాజేష్‌ వార్డు సభ్యులుగా గెలుపొందారు. కాగా వీణవంకలో వారికి శాలువా కప్పి, పూలమొక్క అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్‌ జిల్లా సగర సంఘం అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాసు సగర, జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట రాజు సగర, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నలుబాల భిక్షపతి సగర, జిల్లా మాజీ అధ్యక్షుడు ఏరుకొండ ప్రసాద్‌ సగర, వీణవంక మండల అధ్యక్షుడు గుంటి అశోక్‌ సగర, శ్రీరాములపేట, కొత్తపల్లి గ్రామ శాఖల అధ్యక్షులు దేవునూరి రాజేందర్‌ సగర, గుంటి రాజయ్య సగర, నాయకులు బొడిపెల్లి తిరుపతి సగర, నలుబాల మధు సగర తదితరులు పాల్గొన్నారు.

పూల బొకేలు ఇచ్చి శాలువాలు కప్పి సత్కరిస్తున్న సగర సంగం నాయకులు..

Oplus_16908288

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!