31-12-2025 NORMAL NEWS 09:05 PM
swarnodayam.com
Telugu Daily News
31-12-2025 09:05 PM By Mandala Yadagiri

ఈశ్వర్ రెడ్డి సేవలు అభినందనీయం.. – ఈశ్వర్ రెడ్డి కి ఉద్యోగ విరమణ అభినందనలు

ఈశ్వర్ రెడ్డి సేవలు అభినందనీయం.. – ఈశ్వర్ రెడ్డి కి ఉద్యోగ విరమణ అభినందనలు
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న పలకల ఈశ్వర్ రెడ్డి ఉద్యోగ విరమణ అభినందన కార్యక్రమం ప్రధానోపాధ్యాయురాలు బోరగాల తిరుమల అధ్యక్షతన ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి భూపతి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ ఈశ్వర్ రెడ్డి ఏ పాఠశాలలో పనిచేసిన ఆ పాఠశాల అభివృద్ధి కొరకు నిబద్ధతతో కృషి చేస్తారని అన్నారు. మరొక ముఖ్య అతిథి మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య పాల్గొని మాట్లాడుతూ ఈశ్వర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఉపాధ్యాయులు పనిచేయాలని సూచించారు. మండలంలోని ఇతర ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సమ్మిరెడ్డి, కైరున్నిసా మరియు విడపు శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ ఈశ్వర్ రెడ్డికి ఉద్యోగ విరమణ అభినందనలు తెలియజేశారు. అనంతరం సభాధ్యక్షులు మాట్లాడుతూ ఈశ్వర్ రెడ్డి నలభై సంవత్సరాలు సుదీర్ఘ కాలం పని చేసి ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత అన్ని రకాలుగా సహకరించారని పేర్కొన్నారు. అనంతరం ఈశ్వర్ రెడ్డిని HM మరియు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఘనంగా సన్మానించారు.

రిటైర్డ్ టీచర్ పలకల ఈశ్వర్ రెడ్డి దంపతులను సన్మానిస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!