01-01-2026 NORMAL NEWS 06:53 PM
swarnodayam.com
Telugu Daily News
01-01-2026 06:53 PM By Mandala Yadagiri

ఇన్ సెట్ ఎంట్రన్స్ లో మొదటి ర్యాంకు సాధించిన డాక్టర్ సాయి ప్రీతం.. – ఎంసిహెచ్ యూరాలజీలో సీటు

ఇన్ సెట్ ఎంట్రన్స్ లో మొదటి ర్యాంకు సాధించిన డాక్టర్ సాయి ప్రీతం.. – ఎంసిహెచ్ యూరాలజీలో సీటు
IMG-20260101-WA0093

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజూరాబాద్: వైద్య విద్య పిజి కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఇన్ సెట్ ఎంట్రెన్స్ టెస్ట్ లో మొదటి ర్యాంకు సాధించి న్యూఢిల్లీలోని ఎయిమ్స్ వైద్య కళాశాలలో హుజురాబాద్ కు చెందిన డాక్టర్ సీరంశెట్టి సాయి ప్రీతం సీటు సాధించాడు. దేశవ్యాప్తంగా వైద్య విద్య పీజీ కోర్సుల్లో సీటు సాధించడం కోసం నిర్వహించే ఇన్సైట్ ఎంట్రెన్స్ లో మొదటి ర్యాంకు సాధించి న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో ఎంసిహెచ్ యూరాలజీలో హుజురాబాద్ డాక్టర్ సాయి ప్రీతం సీటు సాధించాడు. హుజురాబాద్ పట్టణానికి చెందిన పిల్లల వైద్యుడు డాక్టర్ సి భాస్కర్ కుమారుడైన డాక్టర్ సాయిప్రీతం ఎంబిబిఎస్ న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్ లో చదివాడు. అనంతరం ఎమ్మెస్ జనరల్ సర్జరీ విభాగంలో ఎయిమ్స్ లోనే పూర్తి చేశాడు. అనంతరం ఇటీవల జరిగిన ఇన్సెట్ ఎంట్రెన్స్ ద్వారా ఎంసిహెచ్ యురాలజీలో న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో సీటు పొందడు. కాగా సాయి ప్రీతం హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ సి వీరయ్య మనవడు. హుజురాబాద్ కు చెందిన సాయి ప్రీతంకు న్యూఢిల్లీ ఎయిమ్స్ లో సీటు రావడం పట్ల సాయి ప్రితంను హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు, పలువురు విద్యాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

డాక్టర్ సాయి ప్రీతం..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!