Social 1080×1350 • Multi-page
01-01-2026 BREAKING NEWS 10:52 PM
swarnodayam.com
Telugu Daily News

రహదారి భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత. – హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచి వేణు

రహదారి భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత. – హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచి వేణు
IMG_20260101_223636

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ లారీ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన రహదారి భద్రత మరియు ట్రాఫిక్ నియమాలు లో భాగంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు తెలుసుకుని వాటిని ప్రతి వాహనదారుడు విధిగా పాటించిన నాడే ప్రమాదాలను నివారించవచ్చునని హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచి వేణు అన్నారు. హుజురాబాద్ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లపై వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు ఖచ్చితంగా పాటించాలని భద్రతా నియమాలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని హుజురాబాద్ వాహనముల తనిఖీ అధికారి కంచి వేణు అన్నారు. వాహనదారులు బయటకు వెళ్లేటప్పుడు, కుటుంబ సభ్యులు తమ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రమాదాల్లో పెద్ద దిక్కును కోల్పోతే కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందన్నారు. కాబట్టి వాహనం నడిపేట ప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాలని, కార్లు నడిపేవారు సీటు బెల్టు పెట్టుకోవాలని, అతివేగం అనర్థదాయకమని, మద్యం తాగి వాహనం నడపవద్దని చెప్పారు. ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయొద్దని హెచ్చరించారు. ఈ విషయాలను ప్రతి వాహనదారులు గమనించాలని సూచించారు. ఎక్కువ శాతం అధిక వేగంతో రోడ్డుపై వాహనాలను నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరుగుతుందని వాపోయారు. రోడ్డుపై వాహనాలు నడిపే ప్రతి ఒక్క వ్యక్తి రూల్స్ ను పాటించి ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా వాహనాలను నడపాలని సూచించారు. ఈ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరికి వాటిపై పూర్తిస్థాయి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. రోడ్డు బద్రతపై ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించనున్నామన వివరించారు. ప్రయాణికులను గమ్య స్ధానాలకు చేరవేసే ఆటోలు, జీపులు, ఇతర ప్రైవేటు రవాణా వాహనాలు పరిమితికి మించి తీసుకెళ్లకూడదని తెలిపారు. ప్రమాదాలను ఆరికట్టడం, వాహనాలు నడపడం, ఆతివేగం వల్ల దుష్పరిణామాలు, ఆ తర్వాత ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందనే అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు నిరంతరం వాహన తనిఖీలు చేపడుతున్నామన్నారు. తాగి వాహనాలు నడిపేవారిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని ఇంకా పర్యవేక్షణ పెంచి ప్రమాదాలు తగ్గించేందకు ప్రయత్నిస్తామని తెలిపారు. రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడిపితే ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకునేందుకు అవకాశం ఉండదన్నారు. ముఖ్య సూచనలు హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి. మొబైల్ ఫోన్ వాడకండి తాగి నడపకండి, వేరేవారిని నడవనివ్వకండి.వేగాన్ని తగ్గించండి.ట్రాఫిక్ నియమాలు పాటించండి ట్రాఫిక్ నియమాలు, సంకేతాల ప్రాముఖ్యతను తెలియజేయడం, ప్రధాన లక్ష్యాలు అవగాహన కల్పించడం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ సిబ్బంది, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ కత్తుల నాగరాజు, హోంగార్డ్ బుర్ర సురేష్ మరియు లారీ అసోసియేషన్ ఓనర్స్ లు మరియు డైవర్స్ పాల్గొన్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచి వేణు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!