Social 1080×1350 • Multi-page
02-01-2026 BREAKING NEWS 08:40 PM
swarnodayam.com
Telugu Daily News

విద్యారంగ సమస్యల పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం.. – ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారావు వెంకటేష్

విద్యారంగ సమస్యల పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం.. – ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారావు వెంకటేష్
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారావు వెంకటేష్ అన్నారు. శుక్రవారం అయిన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల సంక్షేమంపై లేదని, రాష్ట్రంలో విద్యారంగం సమస్యలతో సతమతమవుతోందని అన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సిఎం రేవంత్ రెడ్డి కృషి చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాల ద్వారా విద్యార్థుల హక్కులు సాధిస్తామని అన్నారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు లేవని బిసి సంక్షేమ
హాస్టళ్లు బాలికల హాస్టల్స్ శిథిలావస్థలో ఉన్నాయని వాటికి సొంత భవనాలు నిర్మించాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చొరవ తీసుకుని మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని కోరారు.

– మండల నూతన కమిటీ
మండల అధ్యక్షుడిగా బండి నిఖీల్ కార్యదర్శిగా రాపేళ్ళి రోహిత్, ఉపాధ్యక్షుడిగా కడారి శివాజీ సహాయ కార్యదర్శిగా కయితాల అవినాష్, కోశాధికారిగా చిన్నోజు రాధాకృష్ణ, సభ్యులు రషద్ బాబా, లక్ష్మణ్, అంజీ, హర్షిత్, వరుణ్, రాము, ఎండీ రెజ్వీన్, స్రవణ్, శివా, సాయిచరణ్ ఎన్నికైనారు. ఈ కార్యక్రమంలో
హుజురాబాద్ మండల మహాసభ కేశబోయిన రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారావు వెంకటేష్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!