Social 1080×1350 • Multi-page
02-01-2026 BREAKING NEWS 08:53 PM
swarnodayam.com
Telugu Daily News

డిటిఎఫ్ జిల్లా విద్యా సదస్సును విజయవంతం చేయండి. – డిటిఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీరామ్ చక్రధర్

డిటిఎఫ్ జిల్లా విద్యా సదస్సును విజయవంతం చేయండి. – డిటిఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీరామ్ చక్రధర్
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: ఈనెల 4న హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంటర్లో జరగనున్న డిటిఎఫ్ విద్యా సదస్సును విజయవంతం చేయాలన డిటిఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీరామ్ చక్రధర్ అన్నారు. ఈ సదస్సులో తెలంగాణ రైసింగ్ 2047 విద్యారంగం అనే అంశంపై రాజకీయ విశ్లేషకులు, వీక్షణం పత్రిక ప్రధాన సంపాదకులు ఎన్ వేణుగోపాల్, ఎమ్మెల్సీ ఎం కోదండరాంలు ప్రసంగిస్తారని అన్నారు. డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం సోమయ్య, ప్రధాన కార్యదర్శి టి లింగారెడ్డి, అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులు డాక్టర్ గంగాధర్ తదితరులు పాల్గొంటారనీ అన్నారు. డిటిఎఫ్ నాయకులు ఈశ్వర్ రెడ్డి పదవీ విరమణ సన్మాన సభ జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ అధ్యక్షులు బండ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బి తిరుపతిరెడ్డి, విద్యా పరీక్ష కమిటీ జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల రత్నం, అల్లి శ్రీనివాస్, కనకం వెంకటస్వామి, మల్లేశం, సత్యరాజ్, మహేందర్ రెడ్డి, సతీష్, విక్రమ్, పద్మశ్రీ, భాస్కర్, రాజేష్, శంకర్, వెంకట్రాజం, సదానందం తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డిటిఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీరామ్ చక్రధర్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!