Social 1080×1350 • Multi-page
02-01-2026 BREAKING NEWS 10:57 PM
swarnodayam.com
Telugu Daily News

సిఐ కరుణాకర్ ను సన్మానించిన పలువురు నాయకులు

సిఐ కరుణాకర్ ను సన్మానించిన పలువురు నాయకులు
IMG-20260102-WA0068

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: ప్రభుత్వం ద్వారా ఉత్తమ కఠిన సేవ పథకం పొందిన హుజురాబాద్ టౌన్ సిఐ కే కరుణాకర్ ను శుక్రవారం పలువురు ప్రజా సంఘాల, కుల సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువలతో సత్కరించారు. ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో యాదవ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గొర్ల ఐలేష్ యాదవ్, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు మాడుగుల ఓదెలు, నాయకులు తొగరు బుచ్చయ్య , రాయబారపు హరికృష్ణ ఓరుగంటి రమేష్ యాదవ్, బాషవేణి సమ్మయ్య యాదవ్, బీసీ ఆజాది ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు చిలుకమారి శ్రీనివాస్, బీసీ జేఏసీ కన్వీనర్ సంధ్యల వెంకన్న, నాయకులు నడిగోటి రమేష్, కొలిపాక క్రాంతికుమార్, మంద బిక్షపతి, ఎర్రబోజ్జ నారాయణ, పంజాల వెంకటేశ్వర్లుగౌడ్, రాజు, కందుకూరి భాస్కర్ చారి, తిరుపతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సిఐ కరుణాకర్ ను సన్మానిస్తున్న వివిధ సంఘాల నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!