Social 1080×1350 • Multi-page
02-01-2026 BREAKING NEWS 11:13 PM
swarnodayam.com
Telugu Daily News

మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి దే విజయం.. – బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల నిర్మలరెడ్డి

మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి దే విజయం.. – బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల నిర్మలరెడ్డి
IMG_20260102_230942

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు విజయం సాధించి చైర్మన్ పదవి సాధిస్తారని
బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల నిర్మలరెడ్డి అన్నారు. శుక్రవారం హుజురాబాద్ పట్టణoలోని దర్శిని ఫంక్షన్ హాల్ లో మున్సిపల్ ఎన్నికల సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకునే విధంగా కార్యకర్తలు అందరూ కలిసి పని చేయాలని కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలని ప్రజల వద్దకు తీసుకెళ్లాలని అన్నారు. ప్రజలంతా బిజెపి పై విశ్వాసంతో ఉన్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు తుర్పాటి రాజు, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, గంగిశెట్టి రాజు, మాజీ కౌన్సిలర్ పైళ్ల వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు నల్ల సుమన్, మెరుగు రాజిరెడ్డి, కేసరి శేషయ్య, పోతుల సంజీవ్, పల్లె వీరయ్య, గూడూరి రామిరెడ్డి, సంజీవరెడ్డి, ప్రజా ప్రతినిధులు, శక్తి కేంద్రం ఇంచార్జిలు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల నిర్మలరెడ్డి

హాజరైన ప్రజా ప్రతినిధులు, శక్తి కేంద్రం ఇంచార్జిలు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు

మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేస్తున్న బిజెపి నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!