03-01-2026 NORMAL NEWS 09:32 PM
swarnodayam.com
Telugu Daily News
03-01-2026 09:32 PM By Mandala Yadagiri

హుజూరాబాద్ లో పేకాట స్థావరంపై దాడి…ఏడుగురిపై కేసు నమోదు…

హుజూరాబాద్ లో పేకాట స్థావరంపై దాడి…ఏడుగురిపై కేసు నమోదు…
IMG_20260103_212441

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని జమ్మికుంటరోడ్ లో గల సాయిరూప గార్డెన్స్ సమీపంలో శనివారం పేకాట ఆడుతున్న స్థావరాలపై పోలీసులు దాడి చేసినట్లు హుజూరాబాద్ టౌన్ సిఐ కరుణాకర్ తెలిపారు. తమకు వచ్చిన సమాచారం మేరకు…పేకాట వస్తారంపై దాడి చేసి పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి 40వేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు, ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.
ఈ సందర్భంగా పట్టణ సీఐ కరుణాకర్ మాట్లాడుతూ… అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని, పేకాట ఆడే సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు.

పేకాట ఆడుతూ పట్టుబడిన ఏడుగురు నేరస్తులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!