Social 1080×1350 • Multi-page
03-01-2026 BREAKING NEWS 11:42 PM
swarnodayam.com
Telugu Daily News

గురుకుల పాఠశాలకు లక్షకు పైగా ఫర్నిచర్ అందజేసిన పివి ప్రభాకర్ రావు

గురుకుల పాఠశాలకు లక్షకు పైగా ఫర్నిచర్ అందజేసిన పివి ప్రభాకర్ రావు
IMG_20260103_233932

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్
(వంగర)జనవరి3:
భారతరత్న మాజీ ప్రధాని దివంగత మాజీ ప్రధాని పి.వి.స్వస్థలం భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలోని డా‌.రంగారావు గురుకుల పాఠశాల/కళాశాల సైన్స్ లాబ్స్ కు గాను పి.వి.గ్లోబల్ పౌండేషన్ చేర్మన్ పి.వి.ప్రభాకర్ రావు లక్షకు పైగా విలువైన పర్నీచర్ అందచేశారు. గత డిసెంబరు రెండున వ్యక్తిగత పనుల నిమిత్తం వంగర గ్రామానికి వచ్చి అయన సోదరి యంయల్సీ సురభి వాణిదేవి, పి.వి‌.సోదరుల కుమారులు పివి శరత్, పివి.మదన్ మోహన్ తో పాటు ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వంగరలో పాఠశాల ఏర్పాటుకు గల కారణాలు తెలిపారు. దేశ ప్రధానిగా తమ తండ్రి పి.వి‌ వున్న సమయంలో రాష్ట్రంలో డా.రంగారావు విద్యా మంత్రిగా పని చేశారు. పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించాలనే సంకల్పంతో ఈ ఆశ్రమ పాఠశాల ప్రారంభమైందని గత 30 సంవత్సరాలుగా అనేక మంది ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దిన సంగతి గుర్తు చేశారు. అనేక రంగాలలో ఉన్నత స్థానాలలో కొనసాగుతున్నారని ఆయన తెలిపారు.
అదేవిధంగా స్వంత భూమిని భవనాలకు అందచేసారని డా.రంగారావుకు ఆశ్రమ పాఠశాల మానస పుత్రికగా ఉదహరించారు.
పి.వి‌.నరసింహారావు ఏ విధంగా పేరు సాధించారో విద్యార్థులు కూడా అదే పేరు పొందాలని కోరారు. పాఠశాల ప్రిన్సపాల్ సుల్తానా, ఉపాధ్యాయిని భార్గవి ప్రభుత్వం ద్వార తమకు ప్రయోగశాల కొరకు గాను పరికరాలు అందినప్పటికి పర్నిచర్ లేనందున ఉపయోగ పడని అంశాన్ని ప్రభాకర్ రావు దృష్టికి తేగా పర్నిచర్ అందచేందుకు హామి యిచ్చి రూ.లక్ష విలువైన పర్నిచర్ అందచేశారు.
పాఠశాలకు ఫర్నీచర్ అందించిన ఆయనకు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, సర్పంచ్ సృజన రమేశ్, ఉపసర్పంచ్ రమేశ్, మార్కెట్ కమిటి డైరెక్టర్ వెంకటరెడ్డి, బుచ్చిరెడ్డి, సతీష్, అశోక్, తిరుపతిరెడ్డి, లక్ష్మీకాంతరావు, చంద్రారెడ్డి, సతీష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

లక్షకు పైగా ఫర్నిచర్ అందజేసిన పివి ప్రభాకర్ రావు…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!