Social 1080×1350 • Multi-page
04-01-2026 BREAKING NEWS 05:28 PM
swarnodayam.com
Telugu Daily News

ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలి. – ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలి. – ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..
IMG-20260104-WA0130

జనవరి 11న హన్మకొండలో లక్షమందితో ఓసిల సింహగర్జన సమరభేరి సభ…..

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (కాటారం): ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జనవరి 11న వరంగల్ లో నిర్వహించ తలపెట్టిన ఓసిల సింహగర్జన సభ ఏర్పాట్లపై ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి వెలమ సంఘం నాయకుల, ఓసి ఐకాస నాయకుల సన్నాహక సమావేశంలో రెడ్డి, వెలమ, వైశ్య, బ్రాహ్మణ సామాజిక వర్గీయులు హాజరయ్యారు. ఈసందర్భంగా
ఓసి సామాజిక సంక్షేమ సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావుతో పాటు ఐకాస నాయకులు లు మాట్లాడారు.

Oplus_16908288


ఈడబ్లూఎస్ సర్టిఫికెట్ జారీకి షరతులు లేని 5 ఏళ్ల కాలపరిమితి కలిగి ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు విద్యా ఉద్యోగ పోటీ పరీక్షల వయోపరిమితి పెంచాలని, ఈడబ్లూఎస్ వారికి కేటాయించిన మిగిలి పోయిన బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి వార్షిక ఆదాయ పరిమితి 10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. టెట్ రాత పరీక్ష అర్హతకు 90 మార్కుల నుంచి 70 మార్కులకు తగ్గించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను వర్తింప చేయాలని కోరారు. తమ డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టికి తీసుకెళ్ళేందుకోసం జనవరి 11 న
సాయంత్రం 3 గంటలకు హన్మకొండ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ లో లక్ష మందితో నిర్వహించే రాష్ట్ర స్థాయి ఓసి ల సింహగర్జన భారీ బహిరంగ సభకు ఓసి లంతా రాజకీయాల కతీతంగా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ఐకాస నాయకులకు పిలుపు నిచ్చారు. సింహగర్జన బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్, కరపత్రాలను ఐకాస నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా వెలమ సంఘం అధ్యక్షుడు మెట్టుపల్లి కిషన్ రావుతో పాటు ఓసి జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాకేష్ రెడ్డి ఆసిఫా జిల్లా అధ్యక్షుడు తాళ్ళపల్లి వెంకటరమణా రావు, రెడ్డి సంఘం ప్రతినిధులు రాజిరెడ్డి, మైపాల్ రెడ్డి వైశ్య సంఘం ప్రతినిధులు గణపురం ప్రకాష్, శ్రీనివాస్, హరీశ్, కమ్మ సంఘం ప్రతినిధులు కోనేరు శ్రీకాంత్, రామకృష్ణప్రసాద్, మార్వాడి సంఘం ప్రతినిధులు కమల్ కిషోర్, సురేష్, ఐకాస నాయకులు, కొక్కిరాల మురళీధర్ రావు, బాగినేని రామారావు, మిట్టపల్లి సుధాకర్ రావు, బుడ్డినేని సత్యనారాయణ రావు, వాల ప్రేమలత, కవిత, యాచామనేని విజయలక్ష్మి, రేఖలతో పాటు ఉమ్మడి వెలమ సంఘం నాయకులు పాల్గొన్నారు. అంతకు ముందు భూపాలపల్లి జిల్లా నాయకులతో కాటారంలో ఓసి ఐకాస రాష్ట్ర నాయకుడు జనగామ కరుణాకర్ రావు అధ్యక్షతన జిల్లా జేఏసీ అధ్యక్షుడు మందల రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హాజరై మాట్లాడి వరంగల్ లో నిర్వహించ తలపెట్టిన ఓసిల సింహగర్జన సమరభేరికి భూపాలపల్లి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఓసి లు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు.

Oplus_16908288

పోలాడి రామారావును సత్కరిస్తున్న నాయకులు..

Oplus_16908288
Oplus_16908288

సింహగర్జన బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరిస్తున్న ఐకాస నాయకులు..

మాట్లాడుతున్న ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!