Social 1080×1350 • Multi-page
04-01-2026 BREAKING NEWS 11:36 PM
swarnodayam.com
Telugu Daily News

డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షా శిబిరo సక్సెస్

డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షా శిబిరo సక్సెస్
IMG-20260104-WA0177

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: జాతీయ రోడ్డు భద్రత మాసొత్సవం సందర్భంగా ఆదివారం రవాణా శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించినట్లు హుజురాబాద్ ఎంవిఐ కంచి వేణు తెలిపారు. ఈ శిబిరంలో ప్రభుత్వ కంటి వైద్యులు బోరగాల చొక్కయ్య వారికి కంటి పరీక్షలు నిర్వహించి పలు సలహాలు సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ప్రమాదాలను నివారించడానికి స్పష్టమైన కంటి చూపు యొక్క ప్రాముఖ్యత అవసరమన్నారు. అందువల్ల డ్రైవర్లు తరచుగా తమ కంటి పరీక్షలు నిర్వహించుకోవాలని, అశ్రద్ధ చేస్తే అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. కంటి చూపు లోపం వల్ల అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అందువల్ల రవాణాశాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. మత్తు పదార్థాలు లేదా నిద్రలేమి వల్ల కంటి చూపుపై పడే ప్రభావం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ సిబ్బంది ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ కత్తుల నాగరాజు, హోంగార్డుల సురేష్ డ్రైవర్లు పాల్గొన్నారు.

Oplus_16908288
Oplus_16908288

డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహిస్తున్నట్లు హుజురాబాద్ ఎంవిఐ కంచి వేణు పరిశీలించారు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!