Social 1080×1350 • Multi-page
06-01-2026 BREAKING NEWS 06:02 PM
swarnodayam.com
Telugu Daily News

ఓసిల సింహగర్జన సమరభేరిని విజయవంతం చేయాలి: – ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.

ఓసిల సింహగర్జన సమరభేరిని విజయవంతం చేయాలి: – ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.
IMG-20260106-WA0031(1)

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
జనవరి 11న హన్మకొండలో లక్ష మందితో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి ఓసిల సింహగర్జన సమరభేరి సభను విజయవంతం చేయాలని ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డి పిలుపునిచ్చారు.
వరంగల్ జిల్లా హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో రెడ్డి, వైశ్య, వెలమ, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడి సంఘాలతో ఏర్పడిన రాష్ట్ర ఓసి జేఏసీ ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గస్థాయి ఓసి ఐకాస నాయకుల సన్నాహక సమావేశం ఓసి ఐకాస జిల్లా ప్రథాన కార్యదర్శి ఏనుగు చొక్కారెడ్డి అధ్యక్షతన నిర్వహించగా, వివిధ సామాజిక వర్గాల నాయకులు పాల్గొన్నారు.

మానకొండూరు సమావేశంలో మాట్లాడుతున్న పోలాడి రామారావు..

సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పోలాడి రామారావు మాట్లాడుతూ, ఓసిలంతా ఐక్యతతో ఉన్నప్పుడే తమ హక్కులను కాపాడుకోగలమన్నారు. ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్న అసత్య ప్రచారాలు, కుట్రలను సహించబోమని హెచ్చరించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు పలు డిమాండ్లను ఉంచుతున్నట్లు తెలిపారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో చట్టబద్ధత కలిగిన ప్రత్యేక ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలని, ఓసి విద్యార్థులకు టెట్ అర్హత మార్కులను 90 నుంచి 70కి తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు విద్యా, ఉద్యోగ పోటీ పరీక్షల్లో వయో పరిమితి పెంచాలని, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్‌ను ఎలాంటి షరతులు లేకుండా ఐదేళ్ల కాలపరిమితితో జారీ చేయాలని కోరారు.
ఈడబ్ల్యూఎస్‌కు కేటాయించిన బ్యాక్‌లాగ్ పోస్టులను అదే వర్గంతో వెంటనే భర్తీ చేయాలని, సర్టిఫికెట్ జారీకి వార్షిక ఆదాయ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను నిరుపేద ఓసి విద్యార్థులకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్ల సాధన కోసం జనవరి 11న నిర్వహించే ఓసిల సింహగర్జన సభకు అన్ని ఓసి సామాజిక వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఐకాస నాయకులు కోరారు. ఈ సందర్భంగా సభకు సంబంధించిన గోడప్రతులు, కరపత్రాలను ఆవిష్కరించారు.

గోడప్రతులు కరపత్రాలు ఆవిష్కరిస్తున్న రామారావు, అతిథులు..

ఈ సమావేశంలో ఓసి జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జున్నూతుల రాజిరెడ్డి ఐకాస జిల్లా ప్రథాన కార్యదర్శి ఏనుగు చొక్కా రెడ్డి మాజీ జడ్పీటీసీ యాళ్ళవెంకట్ రెడ్డి, రాంచందర్ రావు, వీరారెడ్డి, రాజిరెడ్డి , సురేష్, మనోహర్ శర్మ తదితరులతో పాటు వివిధ మండలాల ఐకాస నాయకులు పాల్గొన్నారు.

ఓసిల సింహగర్జన సమరభేరిని విజయవంతం చేయాలి : – ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.

జనవరి 11న హన్మకొండలో లక్ష మందితో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి ఓసిల సింహగర్జన సమరభేరి సభను విజయవంతం చేయాలని ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందుపట్ల నరసింహరెడ్డి పిలుపునిచ్చారు.
వరంగల్ జిల్లా హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో రెడ్డి, వైశ్య, వెలమ, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడి సంఘాలతో ఏర్పడిన రాష్ట్ర ఓసి జేఏసీ ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం మంగళవారం హస్నాబాద్ నియోజకవర్గ స్థాయి ఓసి ఐకాస నాయకుల సన్నాహక సమావేశం సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామ మత్స్యగిరీంద్రస్వామి దేవాలయం ఆవరణలో నిర్వహించగా, వివిధ సామాజిక వర్గాల నాయకులు పాల్గొన్నారు.

సైదాపూర్ – వెన్నంపల్లి సమావేశంలో మాట్లాడుతున్న పోలాడి రామారావు..
సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పోలాడి రామారావు మాట్లాడుతూ, ఓసిలంతా ఐక్యతతో ఉన్నప్పుడే తమ హక్కులను కాపాడుకోగలమన్నారు. ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్న అసత్య ప్రచారాలు, కుట్రలను సహించబోమని హెచ్చరించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు పలు డిమాండ్లను ఉంచుతున్నట్లు తెలిపారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో చట్టబద్ధత కలిగిన ప్రత్యేక ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలని, ఓసి విద్యార్థులకు టెట్ అర్హత మార్కులను 90 నుంచి 70కి తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు విద్యా, ఉద్యోగ పోటీ పరీక్షల్లో వయో పరిమితి పెంచాలని, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్‌ను ఎలాంటి షరతులు లేకుండా ఐదేళ్ల కాలపరిమితితో జారీ చేయాలని కోరారు.
ఈడబ్ల్యూఎస్‌కు కేటాయించిన బ్యాక్‌లాగ్ పోస్టులను అదే వర్గంతో వెంటనే భర్తీ చేయాలని, సర్టిఫికెట్ జారీకి వార్షిక ఆదాయ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను నిరుపేద ఓసి విద్యార్థులకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్ల సాధన కోసం జనవరి 11న నిర్వహించే ఓసిల సింహగర్జన సభకు అన్ని ఓసి సామాజిక వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఐకాస నాయకులు కోరారు. ఈ సందర్భంగా సభకు సంబంధించిన గోడప్రతులు, కరపత్రాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సభకు సంబంధించిన గోడప్రతులు, కరపత్రాలను ఆవిష్కరిస్తున్న రామారావు, ఇతర అతిధులు..
ఈ సమావేశంలో ఓసి జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తదితరులతో పాటు వివిధ మండలాల ఐకాస నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఓసి ఐకాస రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందుపట్ల నరసింహరెడ్డి, రాష్ర్ట ఆర్గనైజింగ్ సెక్రటరీ సారబుడ్ల రాజిరెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కంకనాల సరోజన, జిల్లా అధ్యక్షుడు కొనిషెట్టీ మునీందర్, మ్యాకల సంపత్ రెడ్డి, పేరాల ప్రభాకర్ రావు, సారాబుడ్ల వెంకట్ రెడ్డి, అయిత రాజేందర్, కంకణాల జనార్ధన్ రెడ్డి, సారాబుడ్ల లింగారెడ్డి తదితరులతో పాటు నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!