Social 1080×1350 • Multi-page
06-01-2026 BREAKING NEWS 08:13 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ మునిసిపాలిటీలో కాంగ్రెస్ దే విజయం.. – కాంగ్రెస్ ఇన్చార్జి వి ప్రణవ్ బాబు

హుజురాబాద్ మునిసిపాలిటీలో కాంగ్రెస్ దే విజయం.. – కాంగ్రెస్ ఇన్చార్జి వి ప్రణవ్ బాబు
IMG-20260106-WA0073

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: హుజురాబాద్ పట్టణంలోని అనేక ప్రజల సమస్యలను కాంగ్రెస్ పార్టీ పరిష్కరించినందున రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం మనదేనని హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు అన్నారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పట్టణాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తూ,వాటి అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. హుజురాబాద్ మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కృషి చేయాలన్నారు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మున్సిపాలిటీలకు రూ.15 కోట్లు కేటాయించగా దాంట్లో హుజురాబాద్, జమ్మికుంట ఉండడం రెండు మున్సిపాలిటీలకు కలిపి 30 కోట్లు ఇవ్వడం హర్షణీయమని, ఆ నిధుల్లో భాగంగా పట్టణంలో ఉన్న అనేక సమస్యలకు మాస్టర్ ప్లాన్ రూపొందించామని తెలిపారు.హుజురాబాద్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రకి 15 లక్షలు నిధుల కేటాయింపు లాంటి పనులు శరవేగంగా పూర్తి చేశామని తెలిపారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఆర్భాటం ఎక్కువ అభివృద్ధి తక్కువ అని ఈ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ప్రజలు ఓట్లు వేయరని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Oplus_16908288

హుజురాబాద్ లో నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వోడితెల ప్రణవ్

Oplus_16908288

జమ్మికుంటలో మాట్లాడుతున్న ప్రణవ్ బాబు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!