Social 1080×1350 • Multi-page
08-01-2026 BREAKING NEWS 06:27 PM
swarnodayam.com
Telugu Daily News

పద్మశాలిలము ఐక్యతతో ముందుకు సాగాలి.. – బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్.

పద్మశాలిలము ఐక్యతతో ముందుకు సాగాలి.. – బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్.
IMG_20260108_182247

– బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నూతన ప్రజా ప్రతినిధులకు సన్మానాలు.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలని, మానవ సమాజం మనుగడ కోసం అనాదిగా సేవ చేస్తున్న పద్మశాలీయులు రాజకీయంగా ఎదగాలని బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ అన్నారు. ఈ రోజు కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాలోని పలు గ్రామాల్లో నూతనంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లుగా ఎన్నికైన పద్మశాలి సమాజానికి చెందిన నాయకులకు బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్, మాజీ జడ్పీటీసీ సభ్యులు అరుకాల విరేశలింగం, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి వోడ్నాల రవీందర్ లు సన్మానం కార్యక్రమాలను నిర్వహించారు. ఆయా గ్రామాలకు వెళ్లి పద్మశాలి కులస్తులతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధులను సన్మానం చేశారు.
తదనంతరం జక్కని సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర జనాభాలో 28 లక్షలకు పైచిలుకు ఉన్న పద్మశాలి కులస్తులు విద్యారంగంలో వైద్యరంగంలో వస్త్ర ఉత్పత్తి రంగంలో సేవ చేస్తున్నారని అన్నారు. అలాగే వివిధ రంగాలలో శ్రామికులుగా ఉన్నారని, ఎంతో నైపుణ్యతతో పనిచేసే పద్మశాలి కులస్తులు ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్నారని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పద్మశాలి కులానికి ఎలాంటి సహకారం లేదని 28 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ రాజకీయంగా కొద్దిమంది మాత్రమే ఉన్నారని, కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉండడం పద్మశాలి కుల వెనుకబాటుతనానికి నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వారి సేవా దృక్పథంతో ముందుకు వచ్చి వార్డు సభ్యులుగా, సర్పంచులుగా ఉపసర్పంచులుగా ఎన్నికైన పద్మశాలి ప్రజాప్రతినిధులకు జిల్లా వ్యాప్తంగా సన్మానాలు చేస్తున్నామని తెలిపారు. తద్వారా వారికి రాజకీయ స్ఫూర్తిని తీసుకురావడమే లక్ష్యంగా పద్మశాలిల ఐక్యత కోసం పనిచేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి అరకాల వీరేశలింగం, పద్మశాలి సంఘం జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి వోడ్నాల రవీందర్, బీసీ ఆజాది ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు చిలుకమారి శ్రీనివాస్, మండల అధ్యక్షులు మూషం కాశినాదం, పాత్రికేయుడు గజంగి అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_16908288
Oplus_16908288

జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాలోని పలు గ్రామాల్లో నూతనంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లుగా ఎన్నికైన పద్మశాలి సమాజానికి చెందిన నాయకులకు సన్మానం చేస్తున్న బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్, తదితర నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!