Social 1080×1350 • Multi-page
08-01-2026 BREAKING NEWS 10:26 PM
swarnodayam.com
Telugu Daily News

ఓసిల సింహగర్జన సమరభేరి విజయవంతం చేయాలి.- పోలాడి రామారావు.

ఓసిల సింహగర్జన సమరభేరి విజయవంతం చేయాలి.- పోలాడి రామారావు.
IMG_20260108_222157

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ఈనెల 11న వరంగల్ లో నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త ఓసిల సింహగర్జన సమరభేరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు తరలి వచ్చి విజయవంతం చేయాలని ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పిలుపు నిచ్చారు.
ఈమేరకు కరీంనగర్ జిల్లా కోర్టు న్యాయవాదులను సింహగర్జన సమరభేరి సభకు ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలను పోలాడి రామారావు అందజేసి న్యాయవాదులచే గోడ ప్రతులను ఆవిష్కరించి మాట్లాడారు. రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ 10శాతం ఈడబ్ల్యూఎస్ పై రాజకీయ పబ్బo కోసం కొన్ని దుష్ట శక్తులు ఆయా కులాల్లోని ప్రజలను మభ్య పెడుతూ చేస్తున్న అసత్య ప్రచారాలు, పన్నుతున్న కుట్రలను సాగనివ్వబోమని హెచ్చరించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఓసి కమిషన్ ఏర్పాటు, ఓసి విద్యార్థులకు విద్యా ఉద్యోగ పరీక్షలో వయోపరిమితి పెంచాలని, బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, ఓసి లకు టెట్ అర్హత పరీక్ష మార్కులను 90 నుంచి70 మార్కులకు తగ్గించాలనే తదితర డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లేందుకు వరంగల్ లో ఈనెల 11న ఓసి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి ఓసిల సింహగర్జన సమరభేరి కి రాజకీయాల కతీతంగా ఓసిలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఓసిల సింహగర్జన సమరభేరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు తరలి వచ్చి విజయవంతం చేయాలని ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పిలుపు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!