Social 1080×1350 • Multi-page
10-01-2026 BREAKING NEWS 06:11 PM
swarnodayam.com
Telugu Daily News

శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు

శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు
IMG_20260110_180300

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ విద్యానగర్ లో గల శ్రీ వాగ్దేవి డిగ్రీ కాలేజీలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ ఉత్సవాలో భాగంగా విద్యార్థులు కళాశాలను మామిడి తోరణాలతో, అరటి అకులతో అలంకరించి రంగు రంగుల సంక్రాంతి ముగ్గులు వేయడం జరిగింది. అలాగే కళాశాల ఆవరణంలో భోగి మంటలు వేసి నృత్యాలతో అలరించడం జరిగింది.
అనంతరం కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండగ ప్రాముఖ్యత, పండగ జరుపూకునే విధానం గురించి వివరించారు. అలాగే కళాశాల అడ్వైసర్ పోరెడ్డి శాంతన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులందరు మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ, సమాజంలో ఉన్నత వ్వక్తులుగా ఉండాలని అలాగే తల్లిదండ్రుల ఆశాలను నిలబెట్టాలని కోరారు.

అనంతరం ముగ్గుల పోటీలో గెలుపొందిన విద్యార్థులకు శాంతన్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధినీ విద్యార్థులతో పాటు కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ రెడ్డి, అధ్యాపకులు కొలిపాక రమేష్, భద్రయ్య, సంపత్, శ్రీనివాస్, వెంకటేష్, నవీన్, రమేష్, స్వప్న, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులీస్తున్న అతిథి శాంతన్ రెడ్డి…

Oplus_16908288

మాట్లాడుతున్న శాంతన్ రెడ్డి…

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ మహిపాల్ రెడ్డి..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!