11-01-2026 NORMAL NEWS 11:27 PM
swarnodayam.com
Telugu Daily News
11-01-2026 11:27 PM By Mandala Yadagiri

యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు చేసుకున్న ప్రజాకవి తత్వవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యం గౌడ్.

యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు చేసుకున్న ప్రజాకవి తత్వవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యం గౌడ్.
IMG-20260111-WA0039

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన మానవ విలువల పరిరక్షణ జాతీయ అధ్యక్షులు, ప్రజాకవి, రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణులు, అంతర్జాతీయ స్థాయి వరల్డ్ రికార్డ్ అవార్డు గ్రహీత, తత్వవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యంగౌడ్ సామాజిక సేవలు రచనలు వారి ఆధ్యాత్మిక సేవలను ఇంటర్నేషనల్ గ్లోబల్ ఈవెంట్ మరియు అంతర్జాతీయ భారత్ వరల్డ్ రికార్డ్ పలు సంస్థల వ్యవస్థాపకులు కదరి వెంకటరమణరావు సత్యంగౌడ్ సేవలను గుర్తించి, వీరిని ఇంటర్నేషనల్ యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డుకు ఎంపిక చేసి, ఈ అవార్డును హైదరాబాదులోని రవీంద్ర భారతి మెయిన్ హాల్లో .. పలు సంస్థల వ్యవస్థాపకులు కదిరి వెంకట రమణారావు, ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథి ఫార్మర్ చైర్మన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ తెలంగాణ స్టేట్, కోలేటి దామోదర్ గుప్తా మరియు డాక్టర్ శివ నాగార్జునరెడ్డి, ఫిలిం ఆర్టిస్టు ఐశ్వర్య, డాక్టర్ పి. ఝాన్సీరామ్ లు సత్యంగౌడ్ కు పట్టు శాలువా కప్పి, మెడల్ ధరింపజేసి, బొకేను అందజేసి, సన్మాన పత్రంతో పాటు యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు ప్రధానం చేసి ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమ నిర్వాహకులు, ఈ కార్యక్రమంకు వచ్చిన ముఖ్య అతిథి కోలేటి దామోదర్ గుప్తా, దైవజ్ఞ శర్మ, డాక్టర్ శివనాగార్జునరెడ్డి లు మాట్లాడుతూ… సత్యం గౌడ్ ఆధ్యాత్మిక సేవలు, వారి రచనలు సామాజిక సేవలు, వెలకట్టని విలువలన్నారు. ఇంతటి అపార జ్ఞానం కలిగిన సత్యంగౌడ్ దైవాంశ సంభూతులన్నారు. ఇంతటి ఆధ్యాత్మికంగా మనం ఏర్పరచుకున్న విలువలపై అనార్కళంగా మాట్లాడే శక్తి కలిగిన సత్యంగౌడ్ సమాజానికి ఎంతో ఉపయోగపడటం అభినందనీయం అన్నారు. అనంతరం ఆధ్యాత్మిక విశ్వగురువు సత్యంగౌడ్ మాట్లాడుతూ … ప్రతి ఒక్కరూ మనసును అదుపులో పెట్టుకొని, మనసు నిర్మలం పరుచుకొని ప్రశాంతంగా బతకాలి అన్నారు. ఎందరో కళాకారులను, ఆర్టిస్టులను నృత్య కళాకారులను కవులను రచయితలను సామాజిక వేత్తలను ప్రోత్సహిస్తూ వారిని ఆదరిస్తూ వారిలో ఉన్న ప్రతిభను బయటికి తీసి ఎందరికో వారి సంస్థల వక్షణ అవార్డులు రివార్డులు సత్కారాలు చేసి తనదైన శైలిలో వెంకట రమణారావు చేస్తున్న వారి సేవలు అపారమన్నారు. మనుషులు ఒకరికి ఒకరు నష్టం చేసుకోకుండా మనిషి మనిషికి సహకరించే దృక్పధాన్ని అలవర్చుకొని, ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడపాలన్నారు. మనిషి జన్మలో మనిషికి మహోన్నతమైన మంచి మనసు ఉంటుందని, ఆ యొక్క మనసును సత్ప్రయోజనాలకు, సేవా భావాలకు ఆదర్శప్రాయంగా మెదులుతూ, మనం ఏర్పరచుకున్న మంచి మానవత్వాన్ని కాపాడుకుంటూ, ఆదర్శవంతంగా జీవించలనున్నారు. సమాజాని, కిదేశానికి మూల స్తంభాలాంటి వారు నేటి యువత విద్యార్థులేనని, ఇందుకు ప్రతి విద్యార్థి ప్రయోజకుడుగా ఎదిగి నవ సమాజ నిర్మాణానికి పునాదిగా నిలవాలన్నారు. విద్యార్థులు యువత చెడు వేసినాలకు దూరంగా ఉండి దేశ అభివృద్ధికి తోడ్పడుతూ, సమాజ సేవలో భాగస్వాములు కావాలని సత్యంగౌడ్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు అంటరాని స్వార్ధాన్ని వదులుకొని లోక కళ్యాణంలో భాగస్వాములు కావాలని సత్యంగౌడ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంస్థల వ్యవస్థాపకులు, సామాజికవేత్తలు గురువులు, కవులు, రచయితలు, డాన్స్ మాస్టర్లు, టీవీ సీరియల్ ఆర్టిస్టులు, నటులు నృత్య కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

సత్యంగౌడ్ కు పట్టు శాలువా కప్పి, మెడల్ ధరింపజేసి, బొకేను అందజేసి, సన్మాన పత్రంతో పాటు యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు ప్రధానం చేసి ఘనంగా సన్మానిస్తున్న అతిథులు…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!