Social 1080×1350 • Multi-page
12-01-2026 BREAKING NEWS 04:34 PM
swarnodayam.com
Telugu Daily News

అండర్ 19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) నేషనల్ మీట్ కు ఎంపికైన సాయి విగ్నేష్

అండర్ 19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) నేషనల్ మీట్ కు ఎంపికైన సాయి విగ్నేష్
IMG-20260112-WA0045

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాజస్థాన్ లోని ఉదయపూర్ లో త్వరలో జరగనున్న Under 19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) నేషనల్ మీట్ కి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన హాకీ క్రీడాకారుడు సొల్లు సాయి విగ్నేష్ ఎంపికయ్యాడు.
జనవరి 12వ తేదీ నుండి 17వ తేదీ వరకు రాజస్థాన్ లోని ఉదయపూర్ లో Under 19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) నేషనల్ మీట్ కు సొల్లు సాయి విగ్నేష్ తెలంగాణ టీం తరపున హాకి ఆడనున్నాడు. సాయి విగ్నేష్ ఎంపిక కావడం పట్ల హుజురాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షులు తోట రాజేంద్రప్రసాద్, హాకీ క్లబ్ జిల్లా ఉపాధ్యక్షులు బండ శ్రీనివాస్, క్లబ్ హుజురాబాద్ మాజీ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, కార్యదర్శి బొడిగె తిరుపతి, ఉపాధ్యక్షుడు భూసారపు శంకర్, క్రీడాకారులు సాదుల శ్యామ్, సజ్జు, ఎన్ సాయికృష్ణ, విక్రమ్, రాజేష్, సాంబరాజు, వంశీ, వినయ్, వినీత్, విపుల్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

సొల్లు సాయి విగ్నేష్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!