Social 1080×1350 • Multi-page
12-01-2026 BREAKING NEWS 07:28 PM
swarnodayam.com
Telugu Daily News

పార్టీ బలోపేతానికి కృషి చేసిన మహిళ నేతలకే పార్టీ టికెట్లు. – మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నరెడ్డి

పార్టీ బలోపేతానికి కృషి చేసిన మహిళ నేతలకే పార్టీ టికెట్లు. – మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నరెడ్డి
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: పార్టీ బలోపేతానికి కృషి చేసిన మహిళ నేతలకే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేందుకు కృషి చేస్తానని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నరెడ్డి అన్నారు. సోమవారం హుజూరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ నాయకులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కొరకు మహిళా కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని అన్నారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఏ చర్యలు తీసుకోవాలో తెలియజేయాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎవరికి టికెట్ ఇచ్చినా మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు విజయం దిశగా కష్ట పడాలనీ కోరారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ అల్ ఇండియా మహిళా కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. వయనాడ్ ఎంపీ, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు యేముల పుష్పలత, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పుల్ల రాధ, బ్లాక్ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆలేటి సుశీల, జిల్లా వైస్ ప్రెసిడెంట్ లావణ్య, స్వప్న, సునీత తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నరెడ్డి

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!