Social 1080×1350 • Multi-page
12-01-2026 BREAKING NEWS 08:34 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ మున్సిపల్ ఓటర్లు 29,531 మంది.. మరణించిన వారి ఓట్లు తొలగించని అధికారులు.. -సర్వత్ర విమర్శలు.

హుజురాబాద్ మున్సిపల్ ఓటర్లు 29,531 మంది.. మరణించిన వారి ఓట్లు తొలగించని అధికారులు.. -సర్వత్ర విమర్శలు.
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: త్వరలో హుజురాబాద్ మున్సిపాలిటీకి జరగనున్న ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 29,531 అని హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య తెలిపారు. సోమవారం హుజూరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఆయన హుజురాబాద్ మున్సిపాలిటీ 30 వార్డుల యొక్క తుది ఓటరు జాబితాను ఆయన విడుదల చేశారు. హుజురాబాద్ మున్సిపాలిటీలో అత్యల్ప ఓట్లు వచ్చేసి 12వ వార్డు 813 ఓట్లు, అత్యధిక ఓటర్లు 23వ వార్డులో 1184 ఓటర్లు ఉన్నారనీ ఆయన తెలిపారు. అయితే 12వ వార్డులో సైతం పదిమందికి పైగా మృతి చెందిన వారి పేర్లు ఓటర్లుగా ఉండడం గమనార్హం. అంతేగాక ప్రతి వార్డులో కూడా గత ఏడాది కాలంగా మృతి చెందిన వారి పేర్లు తొలగించకుండా బిఎల్వోలు అలాగే ఉంచడం తిరిగి వాటిని ఓటరు కింద చూపెట్టడం అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మృతి చెందిన వారి ఓట్లను తొలగించకపోవడంతో పోలింగ్ సమయంలో పోలింగ్ శాతం తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా బల్దియా అధికారులు స్పందించి మృతి చెందిన వారి పేర్లు, వివరాలు సేకరించి స్వచ్ఛందంగా తొలగించాలని పలువురు ప్రజాసంఘాల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఓటర్ జాబితా ప్రదర్శిస్తున్న మున్సిపల్ కమిషనర్, అధికారులు, సిబ్బంది..

30 వార్డుల్లో ఓట్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!