Social 1080×1350 • Multi-page
12-01-2026 BREAKING NEWS 09:07 PM
swarnodayam.com
Telugu Daily News

సింహగర్జన సభ గ్రాండ్ సక్సెస్.లక్షలాదిగా తరలి వచ్చిన ఓసి కుల బాందవులందరికీ ఓసి జేఏసీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు.

సింహగర్జన సభ గ్రాండ్ సక్సెస్.లక్షలాదిగా తరలి వచ్చిన ఓసి కుల బాందవులందరికీ ఓసి జేఏసీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు.
IMG_20260112_210015

– ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు, రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి…

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
ఆదివారం వరంగల్ లో ఓసి లైన రెడ్డి, వెలమ, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడీ లతో కూడిన ఓసి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓసిల సింహగర్జన సమరభేరి కి రాజకీయాల కతీతంగా రాష్ట్ర నలుమూలల నుంచి స్వచ్ఛందంగా 50 వేలకు పైగా తరలి వచ్చి విజయవంతం చేసిన ఓసి లందరికీ ఓసి జేఏసీ తరపున ఆ సంఘం రాష్ట్ర, జాతీయ అధ్యక్షులు గోపు జయపాల్ రెడ్డి పోలాడి రామారావు పలువురు ఐకాస నాయకులు ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు ప్రత్యేక జాతీయ ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలని, టెట్ లో ఓసి లకు అర్హత మార్కులను 90 నుంచి 70 మార్కులకు తగ్గించాలని, ఈడబ్లూఎస్ కోటా కింద మిగిలిన బ్యాక్ లాగ్ పోస్టులను ఈడబ్ల్యూఎస్ వారితోనే వెంటనే భర్తీ చేయాలని, ఈడబ్ల్యూఎస్ అర్హతకు జారీ చేసే సర్టిఫికెట్ షరతులు లేకుండా 5 ఏళ్ల కాల పరిమితి విధించాలని, ఈడబ్ల్యూఎస్ అర్హతకు వార్షికాదాయ పరిమితి 10 లక్షలకు పెంచాలని, స్ధానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న 50 శాతం కోటా రిజర్వేషన్లు మించకుండా ఓసిలకు కూడా కొంత శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్లను సింహగర్జన సమరభేరి సభ లో ఏకగ్రీవంగా ఆమోదించి ప్రభుత్వాల ముందించిన డిమాండ్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే భర్తీ చేయాలని పోలాడి రామారావు గోపు జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యమ ఉదృతిపై
తదుపరి కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ వచ్చే నెలలో 5 వేల మందితో ఓసి జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ మహా ధర్నా నిర్వహించనున్నట్లు ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డిలు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఐకాస రాష్ట్ర ప్రథాన కార్యదర్శి దుబ్బా శ్రీనివాస్ , నాయకులు చందుపట్ల నరసింహ రెడ్డి, కామిడి సతీశ్ రెడ్డి, యాకూబ్ రెడ్డి, కిషన్ రెడ్డి, కేశవరెడ్డి, వెంకట్ రెడ్డి, పవన్ కుమార్, తిరుపతిరెడ్డితో పాటు వివిధ జిల్లాల ఓసి సామాజిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

రామారావును సన్మానిస్తున్న ఆర్య వైశ్య సత్రం అధ్యక్షుడు, వైశ్య ఫెడరేషన్ జాతీయ నాయకుడు గట్టు మహేష్ బాబు

అనంతరం వరంగల్ ఆర్య వైశ్య సంఘాల నేతలు సింహగర్జన సమరభేరి సభను విజయవంతానికి తీవ్రంగా అహర్నిశలు శ్రమించిన ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావును నాయకులతో కలిసి ఆర్య వైశ్య సత్రం అధ్యక్షుడు, వైశ్య ఫెడరేషన్ జాతీయ నాయకుడు గట్టు మహేష్ బాబు సన్మానించారు.

మాట్లాడుతున్న ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు

మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!