Social 1080×1350 • Multi-page
13-01-2026 BREAKING NEWS 12:12 AM
swarnodayam.com
Telugu Daily News

చిన్నారులకు నీటి శుద్ధికరణ యంత్రాన్ని అందించిన జూనియర్ జడ్జి మానస

చిన్నారులకు నీటి శుద్ధికరణ యంత్రాన్ని అందించిన జూనియర్ జడ్జి మానస
IMG-20260113-WA0011

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలొ చదువుచున్న చిన్నారులకు విద్యానగర్ కు చెందిన జూనియర్ సివిల్ జడ్జి బత్తుల మానస నీటి శుద్ధికరణ యంత్రం సోమవారం బహుకరించారు. ఈ సందర్బంగా జడ్జి మాట్లాడుతూ కలుసిత నీరు త్రాగడం వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని అన్నారు. మన నిత్యం తీసుకునే ఆహారం పట్ల అవగాహన కలిగి ఉండాలని ఆకాంక్షించారు.
నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని అన్నారు.
ప్రభుత్వ విద్యారంగంలో విద్యను భోదించే అధ్యాపక, ఉపాధ్యాయూ లు ధన్యులు అని, చదువుతొ పాటు విద్యార్థుల లక్ష్య సాధనకు మార్గదర్శకంగా నిలుస్తారని నిలుస్తున్నారని జడ్జి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న వారు ఉన్నత శిఖరాలకు ఎదుగుతున్నారని, ఇందుకు గాను నేను ప్రత్యక్ష ఉదాహరణ అని జడ్జి మానస అన్నారు.
ఈ కార్యక్రమంలొ పీవి సేవా సమితి, ఆలయన్స్ అధ్యక్షులు తూము వెంకట్ రెడ్డి, బత్తుల మనోజ్, GOVT PS HM S. మేఘన, ఆలయన్స్ క్లబ్ కార్యదర్శి టీ. మాధవరావు, సీనియర్ నాయకులు తోట రాజేంద్ర ప్రసాద్, చందుపట్ల జనార్దన్, సందేళ్ల వెంకన్న, పవన్ కుమార్, గౌరీ శంకర్, K.సదానందం, ముక్కెర కన్నయ్య, సాగి వీరభద్రరావు, పసుల స్వామి తదితరులు పాల్గొన్నారు.

Oplus_16908288
నీటి శుద్ధికరణ యంత్రంను

పాఠశాలల్లో చదువుచున్న చిన్నారులకు విద్యానగర్ కు చెందిన జూనియర్ సివిల్ జడ్జి బత్తుల మానస

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!