13-01-2026 NORMAL NEWS 11:57 PM
swarnodayam.com
Telugu Daily News
13-01-2026 11:57 PM By Mandala Yadagiri

హుజురాబాద్‌లో 60 పోలింగ్ బూతుల చిత్తు జాబితా విడుదల

హుజురాబాద్‌లో 60 పోలింగ్ బూతుల చిత్తు జాబితా విడుదల
IMG_20260113_235157

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జనవరి13: పురపాలక సంఘ / నగరపాలక సంస్థల రెండవ సాధారణ ఎన్నికలు–2026లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు హుజురాబాద్ పురపాలక సంఘం పరిధిలోని మొత్తం 30 ఎన్నికల వార్డులకు సంబంధించిన 60 పోలింగ్ బూతులను గుర్తిస్తూ చిత్తు జాబితాను మంగళవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కెంసారపు. సమ్మయ్య, కార్యాలయ మేనేజర్ ఆర్ భూపాల్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ ఎన్ అశ్వినీగాంధీతో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్తు జాబితాను పట్టణ ప్రజలు పరిశీలించి, అవసరమైతే తమ అభ్యంతరాలు లేదా సూచనలు సమర్పించుకోవాలని అధికారులు తెలిపారు.

Oplus_16908288
Oplus_16908288

పోలింగ్ బూతులను గుర్తిస్తూ చిత్తు జాబితాను మంగళవారం విడుదల చేస్తున్న కమిషనర్…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!