Social 1080×1350 • Multi-page
14-01-2026 BREAKING NEWS 04:15 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు బ్రెడ్, పండ్ల పంపిణీ చేసిన ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు శివాజీ..

హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు బ్రెడ్, పండ్ల పంపిణీ చేసిన ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు శివాజీ..
IMG_20260114_160902

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి
హుజురాబాద్, జనవరి 14:
ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు, జనరల్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులకు ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వన్నాల శివాజీ ఆధ్వర్యంలో బుధవారం బ్రెడ్, పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ రమేష్ మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులు ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో స్వచ్ఛందంగా ముందుకు రావడం, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. రోగులకు, బాలింతలకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేయడం, పౌష్టికాహారం అందజేయడానికి ఉపసర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వన్నాల శివాజీ ముందుకు రావడం పట్ల అభినందించారు. శివాజీని ఆదర్శంగా తీసుకొని ఇతర ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి నిరుపేదలైన ఆసుపత్రిలోని పేషంట్లకు పండ్లు పంపిణీ చేసేందుకు కృషి చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ బీసీ జేఏసీ అధ్యక్షులు సంధ్యల వెంకన్నతో పాటు రంగాపూర్ ఉప సర్పంచ్ బండి నరేష్, తాళ్లపల్లి శ్రీనివాస్, వడ్లకొండ కిరణ్, గండికోట సంపత్, శేఖర్, ఎండి బాబర్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_16908288

ప్రభుత్వ ఆసుపత్రిలోని పేషంట్లకు, బాలింతలకు పండ్లు, బ్రేడ్లు పంపిణీ చేస్తున్న ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వన్నాల శివాజీ, ఇతర ఉప సర్పంచ్లు, నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!