Social 1080×1350 • Multi-page
16-01-2026 BREAKING NEWS 08:14 PM
swarnodayam.com
Telugu Daily News

ఎన్నిక ఏదైనా విజయం భారతీయ జనతా పార్టీదే. -మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బిజెపి, మిత్రపక్షం ఘనవిజయం. -బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు.

ఎన్నిక ఏదైనా విజయం భారతీయ జనతా పార్టీదే. -మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బిజెపి, మిత్రపక్షం ఘనవిజయం. -బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు.
IMG-20260116-WA0049

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ జనవరి 16 : మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బిజెపి, మిత్రపక్షాల కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు తుర్పాటి రాజు ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో బాణసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా విజయ పరంపర కొనసాగిస్తుందని రానున్న కాలంలో కచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ఆశ భావం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు మోడీ పనితనానికి నిదర్శనం అన్నారు. తెలంగాణలో 117 మున్సిపాలిటీలు 6మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలంతా భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారని ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన సంక్షేమానికి కచ్చితంగా పెద్దపీట వేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, మాజీ పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, మాజీ కౌన్సిలర్లు పైళ్ళ వెంకటరెడ్డి, నల్ల సుమన్, జిల్లా పద అధికారులు సీనియర్ నాయకులు బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ చౌరస్తాలో బాణసంచా పేల్చి సంబరాలు నిర్వహిస్తున్న బిజెపి నాయకులు, కార్యకర్తలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!