Social 1080×1350 • Multi-page
16-01-2026 BREAKING NEWS 08:53 PM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా సంక్రాంతి పర్వదిన వేడుకలు -ఆకట్టుకున్న ఎడ్ల బండ్ల ఊరేగింపు

ఘనంగా సంక్రాంతి పర్వదిన వేడుకలు -ఆకట్టుకున్న ఎడ్ల బండ్ల ఊరేగింపు
IMG_20260116_205007

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: సంక్రాంతి పర్వదినo సందర్భంగా గురువారం రాత్రి హుజురాబాద్ పట్టణంలో ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద భక్తిశ్రద్ధలతో ఆనంద ఉత్సాహల మధ్య ఘనంగా వేడుకలు జరిగాయి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని హుజురాబాద్ పట్టణంలోని ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఈవో సుధాకర్, అధికారులు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరింపజేశారు. భక్తులు స్వామివారి దర్శనానికి రావడానికి వీలుగా బారికెడ్లను నిర్మించారు. గురువారం రాత్రి సాంప్రదాయం ప్రకారం పట్టణంలోని ఆరే ప్రతాపవాడ లకు చెందిన ఎడ్లబండ్లను అందంగా అలంకరింపజేసి డబ్బు చప్పులతో ఊరేగింపుగా తీసుకొని రాగా ఆలయం వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. డాన్స్ మాస్టర్ శ్వేత ఆధ్వర్యంలో చిన్నారులు కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. పర్వదిన వేడుకలు అందరికీ కనపడే విధంగా రెండు ఎల్ఈడి స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. భక్తులు భారీ సంఖ్యలో రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఏఎస్ఐ కమల ఇతర పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

అలరించిన బండ్లు తిరుగుట, సాంస్కృతిక కార్యక్రమాలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!