Social 1080×1350 • Multi-page
17-01-2026 BREAKING NEWS 11:10 PM
swarnodayam.com
Telugu Daily News

కష్టపడండి అవకాశాలు వాటంతట అవే వస్తాయి.. -హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్. – హుజురాబాద్ పట్టణంలో కోలాహలంగా యువజన కాంగ్రెస్ రివ్యూ మీటింగ్.

కష్టపడండి అవకాశాలు వాటంతట అవే వస్తాయి.. -హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్. – హుజురాబాద్ పట్టణంలో కోలాహలంగా యువజన కాంగ్రెస్ రివ్యూ మీటింగ్.
IMG_20260117_230528

– యూత్ కాంగ్రెస్ లో గతంలో పని చేసినవాళ్లు మంచి పదవులో ఉన్నారు.

– హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు సరైన అవకాశాలు లభిస్తున్నాయని, యూత్ కాంగ్రెస్ లో గతంలో పని చేసినవాళ్లు మంచి పదవుల్లోకి వెళ్లారని హుజురాబాద్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పని చేస్తే పదవులు వాటంతట అవే వస్తాయని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. శనివారం రోజున హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్ లో హుజురాబాద్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లూరి రాహుల్ అధ్యక్షతన జరిగిన రివ్యూ మీటింగ్ కి రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జెక్కిడి శివచరణ్ రెడ్డి, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని రాజీవ్ గాంధీ, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి యువజన కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుందని, హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇంచార్జ్ రోషిణి, ఉపాధ్యక్షుడు థామస్, జిల్లా ఇంచార్జి జవహర్, జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్, 5 మండలాల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్

రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జెక్కిడి శివచరణ్ రెడ్డినీ సన్మానిస్తున్న హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్

పెద్ద ఎత్తున హాజరైన యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!