Social 1080×1350 • Multi-page
18-01-2026 BREAKING NEWS 11:57 PM
swarnodayam.com
Telugu Daily News

మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర: సీఎం రేవంత్ రెడ్డి భద్రత, పునరుద్ధరణ ఏర్పాట్ల స్వయంగా సమీక్ష..

మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర: సీఎం రేవంత్ రెడ్డి భద్రత, పునరుద్ధరణ ఏర్పాట్ల స్వయంగా సమీక్ష..
IMG-20260118-WA0086

స్వర్ణోదయం ప్రతినిధి(మేడారం) హైదరాబాద్, జనవరి18: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పెద్ద ఆదివాసీ పండుగగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు సంబంధించి ఏర్పాట్లను ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రివర్గ సహచరులతో కలిసి జంపన్న వాగు సర్కిల్ వరకు బస్సులో ప్రయాణించి, జాతర కోసం వస్తున్న లక్షలాది భక్తుల సౌకర్యాలను పరిశీలించారు.

జాతర భద్రతకు ప్రత్యేకంగా ఏర్పాట్లలో సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నట్లు ముఖ్యమంత్రి పరిశీలించారు. పోలీసులు ఆ కాంక్షించిన ఏఐ (AI) సాంకేతికతతో వీటి పనితీరును వివరించారు. భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపం లేకుండా, భక్తుల సమయం, సౌకర్యం, భద్రతను ముఖ్యమంత్రి కసరత్తుగా సమీక్షించారు.

అతిపెద్ద ఆదివాసీ వారసత్వ సంపదకు ప్రతిబింబించేలా, రాతి ప్రాకారాలు, శిలాతోరణాలతో మేడారం వనదేవతల గద్దెల ప్రాంగణాన్ని పునరుద్ధరించిన పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. మూలవాసుల కోయ తెగల ఆచారాలను కట్టుదిట్టంగా ప్రతిబింబించేలా తీర్చిదిద్దిన ప్రాంగణం, దాదాపు 250 కోట్ల రూపాయల వ్యయంతో శరవేగంగా సాగిన పునరుద్ధరణ పనులను ఒక్కొక్కటిగా పరిశీలించారు.

మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర కోసం ప్రతి ఏర్పాటులో భక్తుల సౌకర్యం, భద్రత మరియు వారసత్వాన్ని సమతుల్యంగా పునరుద్ధరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!