20-01-2026 NORMAL NEWS 07:32 PM
swarnodayam.com
Telugu Daily News
20-01-2026 07:32 PM By Mandala Yadagiri

కిశోర బాలికలకు సమాజ పరిస్థితులపై అవగాహన ఉండాలి.. – డిప్యూటీ డీఎంహెచ్ వో డాక్టర్ చందు

కిశోర బాలికలకు సమాజ పరిస్థితులపై అవగాహన ఉండాలి.. – డిప్యూటీ డీఎంహెచ్ వో డాక్టర్ చందు
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కిశోర బాలికలకు సమాజ పరిస్థితిల పట్ల అవగాహన ఉండాలని, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే తెలిసి ఉండాలని హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చందు అన్నారు. మంగళవారం హుజురాబాద్ పట్టణంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్నేహిత _ 2 కార్యక్రమంలో భాగంగా విద్యార్థినీలకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హై స్కూల్ విద్య చదువుతున్న అమ్మాయిలు వివిధ అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మనతో ఇతరులు మాట్లాడే మాటలు గాని వారి ప్రవర్తన గాని గమనించాలని అన్నారు. వారి ఉద్దేశం సరికాదు అన్నప్పుడు వెంటనే వారికి దూరంగా ఉండాలని నో చెప్పాలని అన్నారు. స్నేహిత కార్యక్రమం విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందని, ప్రతి పాఠశాలలో ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేశారని, దానిని తప్పక వినియోగించుకోవాలని అని అన్నారు.. సమస్యలు ఉంటే నిర్భయంగా చీటీలు రాసి ఫిర్యాదుల పెట్టెలో వేయాలని, రాసే వారి పేర్లను పొందుపరచాల్సిన అవసరం లేదని, ఫిర్యాదులు అందిన వెంటనే షీ టీం సిబ్బంది తప్పక స్పందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం లో చెల్పూర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తులసిదాస్, ఎం ఈ వో భూపతి శ్రీనివాస్, ఎస్సై యూనస్ ఆలీ, మండల వ్యవసాయ అధికారి భూమి రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు సునీత, ఝాన్సీ ప్రసూన, ఐసిడిఎస్ సూపర్వైజర్ రమ్య రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ సత్యం తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ చందు

ఎంజెపి పాఠశాలలో….

హుజురాబాద్ పట్టణ శివారులోని ఎంజెపి పాఠశాలలో మంగళవారం స్నేహిత_2 కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా సైదాపూర్ పిహెచ్సి ఆరోగ్య పర్యవేక్షకుడు రమేష్ మాట్లాడుతూ..సమాజంలో పిల్లలపై హింస అనేక రూపాల్లో తాండవం చేస్తున్నదని, వాటి పట్ల కౌమార విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నేటి సమాజంలో బడి ఈడు పిల్లలపై లైంగిక వేధింపులు, శారీరక , భావోద్వేగ పూరితమై ఉండవచ్చని వాటిపట్ల విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాణి, ఐసీడీఎస్ సీడిపివో సుగుణ, డాక్టర్ మీనాక్షి, ఏఈఓ నిఖిల్, సూపర్వైజర్ రమ్య, ఉపాధ్యాయులు రాధిక, హిమారాణి, సాగర్, రవి విద్యార్థులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!