Social 1080×1350 • Multi-page
21-01-2026 BREAKING NEWS 06:40 PM
swarnodayam.com
Telugu Daily News

వెలిచాల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన తిప్పారపు శ్రీనివాస్

వెలిచాల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన తిప్పారపు శ్రీనివాస్
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు సమక్షంలో బుధవారం సామాజిక కార్యకర్త 12వ డివిజన్ కు చెందిన నాయకుడు తిప్పారపు శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తిప్పారపు శ్రీనివాస్ గతంలో బీఆర్ఎస్, బిజెపి పార్టీలో పని చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ కు రాజేందర్ రావు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. రాజేందర్ రావు మాట్లాడుతూ స్వచ్ఛంద కార్యక్రమాలతో సామాజిక సేవ చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న తిప్పారపు శ్రీనివాసు కాంగ్రెస్ పార్టీలో చేరడం అభినందనీయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున నాయకులు చేరుతున్నారని పేర్కొన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి నగరపాలక సంస్థపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని చెప్పారు. ప్రజలంతా రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తోనే కరీంనగర్ అభివృద్ధి సాధ్యమవుతుందని రాజేందర్రావు పేర్కొన్నారు. కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని అందుకోసమే కాంగ్రెస్ పార్టీలో రాజేందర్ రావు ఆధ్వర్యంలో చేరానని తిప్పారపు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తాళ్లపల్లి మహేష్, రుద్రాక్ష కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

తిప్పారపు శ్రీనివాస్ కు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న రాజేందర్ రావు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!