21-01-2026 NORMAL NEWS 09:40 PM
swarnodayam.com
Telugu Daily News
21-01-2026 09:40 PM By Mandala Yadagiri

రహదారి భద్రత నియమాలు ప్రతి ఒక్కరు పాటించాలి… – విద్యార్థులతో సైకిల్ ర్యాలీ. – హుజురాబాద్ వాహనముల తనిఖీ అధికారి కంచి వేణు

రహదారి భద్రత నియమాలు ప్రతి ఒక్కరు పాటించాలి… – విద్యార్థులతో సైకిల్ ర్యాలీ. – హుజురాబాద్ వాహనముల తనిఖీ అధికారి కంచి వేణు
IMG-20260121-WA0077

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట): జమ్మికుంట కాకతీయ స్కూల్ లో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం సందర్భంగా వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రహదారి భద్రత నియమాలు పాటించాలని మోటర్ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ కంచి వేణు అన్నారు. వాహనదారులకు రహదారి భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ ధరించాలని, వాహనాల నడిపే ప్రతి ఒక్కరూ అన్ని ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండి మద్యం సేవించకుండా రహదారి భద్రతా నియమాలు పాటించి వాహనాలు నడపాలని సూచిం చారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచి వేణు మాట్లాడుతూ నిర్వహించే సైకిల్ ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశ్యం పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థను ప్రోత్సహించడం పర్యావరణ హితం సైక్లింగ్ మరియు ఎలక్ట్రిక్ వాహనాల (EVs) వాడకం ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించి, వాయు కాలుష్యాన్ని అరికట్టవచ్చు భవిష్యత్తు తరాల కోసం ఇంధన వనరులను ఆదా చేస్తూ, తక్కువ ఖర్చుతో కూడిన రవాణా మార్గాలను అవలంబించడం దీని లక్ష్యం వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించడం, హెల్మెట్ ధరించడం మరియు రోడ్లపై పాదచారులకు, సైక్లిస్టులకు ప్రాధాన్యత ఇవ్వడంపై అవగాహన కల్పిస్తారు.ఆరోగ్యం సైక్లింగ్‌ను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవడం వల్ల శారీరక దృఢత్వం పెరుగుతుంది మరియు జీవనశైలి వ్యాధులు తగ్గుతాయి.హెల్మెట్‌ ధరించి వాహనం నడుపు తున్న వారిని అభినందించాలన్నారు. వాహనదారులు బయటకు వెళ్లేటప్పుడు, కుటుంబ సభ్యులు తమ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రమాదాల్లో పెద్ద దిక్కును కోల్పోతే కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందన్నారు. కాబట్టి వాహనం నడిపేట ప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచిం చారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాలని, కార్లు నడిపేవారు సీటు బెల్టు పెట్టుకోవాలని, అతివేగం అనర్థదాయకమని, మద్యం తాగి వాహనం నడపవద్దని చెప్పారు. ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయొద్దని హెచ్చరించారు. ఈ విషయాలను ప్రతి వాహనదారులు గమనించాలని హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచి వేణు సూచించారు.రోడ్డు భద్రతా అవగాహన కల్పించడం సందర్భంగా ప్రజలకు ట్రాఫిక్ నియమాలు, సంకేతాలు, వేగ పరిమితులు, సరైన డ్రైవింగ్ పద్ధతులపై అవగాహన కల్పించడం.హెల్మెట్, సీట్ బెల్ట్ వాడకం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం, ఫోన్ వాడకం మానేయడం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడంపై దృష్టి సారించడం.
అవగాహన కల్పించడంతో పాటు, హెల్మెట్ ధరించనివారికి జరిమానా విధించడం వంటి కఠిన చర్యలు కూడా తీసుకుంటారు. లక్ష్యాలు
రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించడం.
ప్రజల్లో రోడ్డు భద్రత పట్ల బాధ్యతాయుతమైన వైఖరిని పెంపొందించడం.
సురక్షితమైన రోడ్లు, సమాజం కోసం కృషి చేయడం. ఈ కార్యక్రమంలో కాకతీయ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు కానిస్టేబుల్ కత్తులు నాగరాజు, హోంగార్డ్ బుర్ర సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_16908288

వాహనదారులకు రహదారి భద్రత నియమాలపై అవగాహన కల్పిస్తున్న మోటర్ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ కంచి వేణు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!