21-01-2026 NORMAL NEWS 10:58 PM
swarnodayam.com
Telugu Daily News
21-01-2026 10:58 PM By Mandala Yadagiri

తిరువీధి ఉత్సవములో గోదా పద్మవతి వెంకటేశులు

తిరువీధి ఉత్సవములో గోదా పద్మవతి వెంకటేశులు
IMG_20260121_225532

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జనవరి 21: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మునిసిపల్ పరిధిలోని కేసి క్యాంపులో గల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రోజున తిరువీధి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గోదా, పద్మావతి, సహిత వెంకటేశ్వర్లు హుజురాబాద్ తిరువీధుల్లో విహరించారు. ఈ సందర్భంగా భక్తులు మంగళహారతులతో స్వాగతించి దేవుని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరస్వామి భక్తి గీతాలను ఆలపిస్తూ భక్తులు స్వామి రథం వెంట పాల్గొన్నారు.

ఉత్సవ విగ్రహాన్ని ఊరేగిస్తున్న పూజారులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!