Social 1080×1350 • Multi-page
24-01-2026 BREAKING NEWS 06:12 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ లో సుందరం హోమ్ ఫైనాన్స్ నూతన బ్రాంచ్ ప్రారంభం.

హుజురాబాద్ లో సుందరం హోమ్ ఫైనాన్స్ నూతన బ్రాంచ్ ప్రారంభం.
IMG_20260124_175520

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సుందరం ఫైనాన్స్ లిమిటెడ్, వారి అనుబంధ సంస్థ సుందరం హోమ్ ఫైనాన్స్ తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నూతన బ్రాంచ్ ను సుందరం హోం ఫైనాన్స్ ను EB బిజినెస్ హెడ్ సురేష్ బాబు, రీజినల్ హెడ్ మల్లేష్ లు క్లస్టర్ హెడ్స్ అమ్మిరెడ్డి, నాగ రవిప్రసాద్, యాకయ్యలతో కలిసి ప్రారంభించారు. సంస్థ ఉద్యోగులు, కార్పొరేట్ చానల్ పార్టనర్లు మరియు ఇతర బిజినెస్ పార్టనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుందరం హోం ఫైనాన్స్ EB బిజినెస్ హెడ్ సురేష్ బాబు, రీజినల్ హెడ్ మల్లేష్ లు మాట్లాడుతూ..అందరికీ ఇల్లు మరియు అందరికీ ఇంటి ఋణం లక్ష్యంగా సుందరం హోమ్ ఫైనాన్స్ అనుగ్రహ అనే హోమ్ లోన్ పథకం ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ పథకం కింద, తక్కువ ఆదాయo, ఏ విధమైన ఆదాయ డాక్యుమెంట్ లేని చిన్న వ్యాపార సంస్థలు, చిన్న వ్యాపార సంస్థలలో పని చేసి జీతం నగదు రూపంలో పొందే వారికి (చిన్న వ్యాపారులు పూజారులు, నర్సులు, బాడుగ/ అద్దె పొందే వారు, డ్రైవర్ లు, ఏ విధమైన ఇన్కమ్ టాక్స్ లేని వారు) గరిష్ఠంగా 40 లక్షల వరకు రుణం అందుబాటులో ఉంటుందన్నారు. హుజూరాబాద్ పరిసర గ్రామాల ప్రజలకు, వారసత్వంగా లభించిన ఆస్తులపై, గ్రామ రికార్డులు కలిగి, Possession (పొజిషన్ సర్టిఫికెట్) certificate ఆధారంగా, రెవెన్యూ రికార్డులు ఆధారంగా, ఇంటి పన్ను రసీదు ఆధారంగా కలిగిన ఆస్తులకు హోమ్ లోన్స్ ఇవ్వ బడుననీ తెలిపారు.

రిబ్బన్ కట్ చేసి నూతన సుందరం హోం ఫైనాన్స్ ను ప్రారంభిస్తున్న EB బిజినెస్ హెడ్ సురేష్ బాబు, రీజినల్ హెడ్ మల్లేష్ లు..

భారతదేశం అంతటా 150 బ్రాంచులతో మరియు 1.5 లక్షల మందికి పైగా ఖాతాదారులకు గృహ రుణాలు అందించిన, సుందరం హోమ్ ఫైనాన్స్ అందరికీ అందుబాటులో గృహ రుణాలు అందించడానికి కట్టుబడి ఉందన్నారు. ఒక లక్ష రూపాయల నుండి 10 కోట్ల రూపాయల వరకు ఉద్యోగులు మరియు వ్యాపారస్తులకు వివిధ ఋణ పధకాల ద్వారా హోమ్ లోన్, ఫ్లాట్ లోన్స్, కమర్షియల్ పర్చేస్ మరియు మార్ట్గేజ్ రుణాలు అందుబాటులో ఉన్నాయనీ లబ్ధిదారులు నేరుగా తమ కార్యాలయంలో సంప్రదించవచ్చునని వారు సూచించారు.

Oplus_16908288

నూతన సుందరం హోం ఫైనాన్స్ ను ప్రారంభించి మాట్లాడుతున్న అతిథులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!