Social 1080×1350 • Multi-page
24-01-2026 BREAKING NEWS 08:23 PM
swarnodayam.com
Telugu Daily News

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు, ఓసిల స్థితి గతుల అధ్యయనానికి చట్టబద్దతతో కూడిన ప్రత్యేక జాతీయ ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలి. – ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు, ఓసిల స్థితి గతుల అధ్యయనానికి చట్టబద్దతతో కూడిన ప్రత్యేక జాతీయ ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలి. – ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.
IMG_20260124_201409

– ఫిబ్రవరి 23న డిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఓసి జేఏసీ ఆధ్వర్యంలో ఓసిల జాతీయస్థాయి మహాధర్నా.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (పెద్దపల్లి): ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు, ఓసి ల స్థితి గతులు అధ్యయనానికి జాతీయ రాష్ట్రాల స్థాయిలో చట్టబద్ధత గల ప్రత్యేక జాతీయ ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. శనివారం పెద్దపల్లి ఎమ్మెల్యే, చింతకుంట విజయ రమణరావును, పెద్దపల్లి మాజీ శాసన సభ్యుడు దాసరి మనోహర్ రెడ్డి, ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర అధ్యక్షుడు అంబటి జోజీరెడ్డిలను ఫిబ్రవరి 23న డిల్లిలో జంతర్ మంతర్ వద్ద జాతీయ స్థాయిలో ఓసి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ఓసిల మహాధర్నా ఏర్పాట్లపై ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు వారి వారి నివాసంలో నాయకులతో కలిసి వివరిస్తూ మహా ధర్నాకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆహ్వాన పత్రికలను పోలాడి రామారావు అందజేసి వారిచే మహాధర్నా గోడ ప్రతులను రామారావు ఆవిష్కరింపజేశారు. వారు సానుకూలంగా స్పందించడం పట్ల రామారావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ రాజ్యాంగ బద్దంగా ఏర్పాటు చేసిన 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై రాజకీయ పబ్బం కోసం కొందరు దుష్ట శక్తులు ఆయా కులాల్లోని ప్రజలను మభ్య పెడుతూ అసత్య ప్రచారాలకు తెరలేపారని ఆరోపించారు. ఇకపై ఇలాంటి కుట్రలను సాగనివ్వ బోమని హెచ్చరించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో జరుగుతున్న కుట్రల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు విద్యా, ఉద్యోగ, పోటీ పరీక్షలలో వయోపరిమితిని పెంచాలని , ఈడబ్ల్యూఎస్ వారికి కేటాయించగా మిగిలిన బ్యాక్ లాగ్ పోస్టులను సైతం ఆ వర్గాల వారితోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి 10లక్షల ఆదాయ పరిమితి పెంచాలన్నారు. ప్రస్తుతం ఉన్న 50శాతం రిజర్వేషన్లలో ఓసి వర్గాలవారికి రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.ఇట్టి దిమాండ్ల సాధనకు ఫిబ్రవరి 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓసి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ఓసిల జాతీయస్థాయి మహాధర్నాకు రాజకీయాల కతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఓసి సామాజిక వర్గీయులు తరలి వచ్చి విజయవంతం చేయాలని రామారావు కోరారు. ఈ కార్యక్రమంలో ఓసి జేఏసీ ఐకాస జిల్లా, రాష్ట్ర నాయకులు బైరెడ్డి రాంరెడ్డి, ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి, బుచ్చిరాం రావు , ప్రసాద్ రావు రాఘవలు, పాల్గొన్నారు

పెద్దపల్లి ఎమ్మెల్యే, చింతకుంట విజయ రమణరావును కలిసి మహాధర్నకు రావాలని ఆహ్వానిస్తున్న పోలాడి రామారావు..

పెద్దపల్లి మాజీ శాసన సభ్యుడు దాసరి మనోహర్ రెడ్డి కి ఆహ్వాన పత్రిక అందజేసి మహాధర్నకు రావాలని ఆహ్వానిస్తున్న పోలాడి రామారావు..

Oplus_16908288

ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర అధ్యక్షుడు అంబటి జోజీరెడ్డినీ ఫిబ్రవరి 23న డిల్లిలో జంతర్ మంతర్ వద్ద జాతీయ స్థాయిలో ఓసి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ఓసిల మహాధర్నాకు ఆహ్వానిస్తున్న రామారావు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!