Social 1080×1350 • Multi-page
24-01-2026 BREAKING NEWS 09:46 PM
swarnodayam.com
Telugu Daily News

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత… – మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచి వేణు

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత… – మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచి వేణు
IMG_20260124_213946

– రోడ్డు భద్రతపై విజ్ఞాన్ విద్యార్థుల ర్యాలీ

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జాతీయ రహదారి భద్రత మాసోత్సవం సందర్భంగా శనివారం అంబేద్కర్ చౌరస్తా వద్ద స్థానిక విజ్ఞాన్ స్కూల్ పిల్లలతో పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి హుజురాబాద్ వాహనముల తనిఖీ అధికారి కంచి వేణు మరియు హుజురాబాద్ పట్టణ సీఐ కరుణాకర్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హుజురాబాద్ వాహనముల తనిఖీ అధికారి కంచి వేణు మాట్లాడుతూ…. రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ప్రజలు, వాహన దారులకు, విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాముఖ్యత, హెల్మెట్ ధరించడం, సీటుబెల్ట్ వినియోగం, జీబ్రా క్రాసింగ్ ద్వారా రోడ్డు దాటడం, వేగ నియంత్రణ అవసరం వంటి అంశాలపై వివరించారు. చిన్న వయసులోనే రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. “విద్యార్థులే భవిష్యత్తు రోడ్డు వినియోగదారులు. వారిలో ఇప్పుడే భద్రతా అలవాట్లు పెంపొందిస్తే సమాజం సురక్షితంగా మారుతుంది” అన్నారు.

మాట్లాడుతున్న ఎంవీఐ కంచి వేణు..
అనంతరం హుజురాబాద్ సీఐ కరుణాకర్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలపాటించాలని నిబంధనల పట్ల విద్యార్థులకు, ప్రజలకు, వాహనదారులకు అవగాహన కల్పించడం మరియు రహదారి ప్రమాదాల సంఖ్యను తగ్గించడం చాలా అవసరమని తెలిపారు.

మాట్లాడుతున్న టౌన్ సిఐ కరుణాకర్..
ఈ ర్యాలీల ప్రధాన లక్ష్యంగా విజ్ఞాన్ పాఠశాల
విద్యార్థులు చేసిన నినాదాలు,
హెల్మెట్ ధరించండి – ప్రాణాలను కాపాడుకోండి”, “అతివేగం ప్రమాదకరం”, మరియు “మద్యం సేవించి వాహనం నడపరాదు” వంటి ప్లకార్డులతో ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాధాన్యతను వివరిస్తూ నాటీకా రూపంలో చేసిన ప్రదర్శన మరియు ‘రోడ్ సేఫ్టీ’ డెమోలు, సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి.

ర్యాలీ అనంతరం
విద్యార్థులందరిని ఎమ్ విఐ కంచి వేణు అభినందించి వారితో తాము ట్రాఫిక్ నియమాలను పాటిస్తామని, ఇతరులను కూడా ప్రోత్సహిస్తామని ప్రతిజ్ఞ చేపించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ పాఠశాల కరెస్పాండంట్ దాసరి కోటేశ్వర్ యాదవ్, డైరెక్టర్ తిరుపతి యాదవ్, కో ఆర్డినేటర్ సుమలత, తిరుపతి, స్కూల్ విద్యార్థులు, రవాణా శాఖ సిబ్బంది కానిస్టేబుల్ కత్తుల నాగరాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ర్యాలీగా వస్తున్న విజ్ఞాన్ పాఠశాల విద్యార్థులు..

చౌరస్తాలో ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులు, అతిథులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!