Social 1080×1350 • Multi-page
25-01-2026 BREAKING NEWS 10:03 PM
swarnodayam.com
Telugu Daily News

ప్రయాణికుల ప్రయోజనాలకు నష్టం కలగకూడదు. – హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచి వేణు

ప్రయాణికుల ప్రయోజనాలకు నష్టం కలగకూడదు. – హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచి వేణు
IMG-20260125-WA0098

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మోటార్ క్యాబ్, ఆటో డ్రైవర్లు తమ వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికుల ప్రయోజనాలకు నష్టం కలిగించరాదని హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచి వేణు అన్నారు. ఆదివారం హుజురాబాద్ పట్టణంలో జాతీయ రోడ్డు భద్రత మహోత్సవం సందర్భంగా మోటార్ క్యాబ్ ఓనర్లు, డ్రైవర్లకు,ఆటో డ్రైవర్స్ కు భద్రత పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతివేగం ప్రమాదకరం అని, ముందుగా బయలుదేరి క్షేమంగా గమ్యాన్ని చేరుకోవాలన్నారు. ఉత్తమ వాహనాలకు లైసెన్సు ఇన్సూరెన్స్ అన్ని రకాల కాగితాలు వాహనంలోనే ఉండాలని అన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను తీసుకొని వెళ్ళరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ నాగరాజు, హోంగార్డ్ బుర్ర సురేష్, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు

డ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడుతున్న ఏంవిఐ కంచి వేణు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!