25-01-2026 NORMAL NEWS 11:15 PM
swarnodayam.com
Telugu Daily News
25-01-2026 11:15 PM By Mandala Yadagiri

ఒడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు.. – జమ్మికుంట 16వ వార్డులో కాంగ్రెస్‌కు భారీ బలం

ఒడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు.. – జమ్మికుంట 16వ వార్డులో కాంగ్రెస్‌కు భారీ బలం
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి జనవరి 25: హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణ పరిధిలోని 16వ వార్డులో డాక్టర్ సురంజన్ ఆధ్వర్యంలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఒడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా కాంగ్రెస్ పార్టీకి భారీ బలం చేకూరింది.
ఈ సందర్భంగా ఒడితల ప్రణవ్ పార్టీలో చేరిన వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. డాక్టర్ సురంజన్ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తూ విశేష సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పార్టీలో చేరిన నాయకులు ప్రశంసలు కురిపించారు. ఆయనను 16వ వార్డు కౌన్సిలర్‌గా గెలిపించి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వాసాల రామస్వామి, అజయ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. వారి చేరికతో జమ్మికుంటలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

డాక్టర్ సురంజన్ ఆధ్వర్యంలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఒడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన దృశ్యం.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!